భారత్‌లో మరిన్ని సాఫ్ట్‌వేర్‌ కేంద్రాలు: ఐబీఎం

20 Nov, 2021 08:58 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికన్‌ టెక్‌ దిగ్గజం ఐబీఎం..కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటైజేషన్‌ ప్రక్రియలో భాగం కావాలని భావిస్తోంది. భారత్‌లో మరిన్ని సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కంపెనీ చైర్మన్‌ అరవింద్‌ కృష్ణ ఈ విషయాలు తెలిపారు.

భారత పర్యటనలో భాగంగా కృష్ణ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌లతో ఆయన భేటీ అయ్యారు. ప్రభుత్వంతో కలిసి నైపుణ్యాల్లో శిక్షణ కల్పించడం తదితర అంశాలపై చర్చించారు. త్వరలో మరిన్ని రానున్నాయని వివరించారు.

చదవండి: దేశీయంగా యాపిల్‌ విస్తరణ..10 లక్షల ఉద్యోగాలు టార్గెట్‌  

మరిన్ని వార్తలు