కొత్త బంకుల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిందే!

10 Oct, 2021 15:29 IST|Sakshi

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంధన సరళీకృత చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పెట్రోల్ బంకుల సంఖ్య పెంచేందుకు ఇంధనేతర కంపెనీలకూ లైసెన్స్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త ఇంధన రిటైల్ నూతన సరళీకృత విధానాల్లో వివిధ షరతులు ఉన్నాయి. పెట్రోల్ బంకులు ఎన్ని ఉండాలి, ఎక్కడెక్కడ వాటిని నిర్వహించాలనే వివిధ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం నడిస్తేనే కొత్త సంస్థలకు అవకాశం ఇస్తారు.

రిటైల్ పెట్రోల్ పంపుల గెజిటే నోటిఫికేషన్ ప్రకారం.. కనీసం 100 పెట్రోల్ బంకులు నెలకొల్పాలి. ఇందులో 5 శాతం మారుమూల ప్రాంతాల్లో ఉండాలి. అలాగే, కంప్రెస్డ్ నేచరల్ గ్యాస్(CNG), బయోఫ్యూయల్, లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్, ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ వంటి న్యూ జనరేషన్ ఇంధన మార్కెటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. మూడేళ్లలో ప్రతిపాదిత రిటైల్ అవుట్ లెట్లలో వాటిని ఏర్పాటు చేసుకోవాలి అని పేర్కొంది. భారతదేశం కొత్త సరళీకృత పెట్రోల్ పంప్ లైసెన్సింగ్ నిబంధనల ప్రకారం.. ఇక నుంచి కొత్తగా పెట్రోల్, డీజిల్ స్టేషన్ ప్రారంభించే స్టేషన్లలో అమ్మకాలు చేసే ముందు కంప్రెస్డ్ నేచరల్ గ్యాస్(CNG), బయోఫ్యూయల్, లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్, ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొంది.(చదవండి: వాట్సాప్‌లో ఇలా చేశారో..! మీ అకౌంట్‌ను మర్చిపోవాల్సిందే..!)

మరిన్ని వార్తలు