-

ఎలక్ట్రిక్‌ స్కూటర్లు తగలబడటానికి కారణాలు ఇవి ..

9 May, 2022 13:16 IST|Sakshi

వేసవి రావడంతోనే దేశవ్యాప్తంలా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ అగ్నిప్రమాదాల్లో జరిగాయి. ఒకటి కాదు రెండు కాదు గత నెలరోజులుగా ఉన్నట్టుండి ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో మంటలు చెలరేగాయి. ఒకటి రెండు ఘటనల్లో ప్రాణనష్టం కూడా జరిగింది. దీంతో ఈవీ స్కూటర్లలో ప్రమాదాలపై కేంద్రం హై లెవల్‌ విచారణ కమిటీని నియమించింది. ఇందులో ప్రాథమికంగా వెల్లడైన అంశాలతో రాయిటర్స్‌ కథనం ప్రచురించింది.

ఇవి కారణాలు
ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణాల్లో బ్యాటరీ సెల్స్‌, మాడ్యుల్స్‌లో లోపాల కారణంగా జరిగినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదాలు జరిగిన చోట వివిధ కంపెనీలకు చెందిన స్కూటర్ల నుంచి శాంపిల్స్‌ తీసుకుని ఈ దర్యాప్తు చేపట్టారు.
- ఒకినావా ప్రమాదానికి సంబంధించి సెల్స్‌, బ్యాటరీ మాడ్యుల్స్‌ కారణంగా తేల్చింది.
- తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ అగ్నిప్రమాదానికి సంబంధించి బ్యాటరీ కేసింగ్‌లో లోపాలు ఉన్నట్టు గుర్తించారు.
- ఇక దేశవ్యాప్తంగా భారీగా అమ్ముడైన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు సంబంధించి బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో లోపాలు ఉన్నట్టుగా తెలిసింది, అయితే దీనిపై ఓలా స్పందిస్తూ.. ఓలా బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో ఏ సమస్యా లేదని కానీ ఐసోలేటెడ్‌ థర్మల్‌ ఇష్యూ కారణంగా ఓలా స్కూటర్లు ఫైర్‌ యాక్సిడెంట్‌కి గురైనట్టుగా తెలపింది.

తుది నివేదిక
ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై ఏర్పాటైన కమిటీ ప్రస్తుతానికి ప్రాథమిక అంచనాలకే వచ్చిందని. మరిన్ని అంశాలను లోతుగా పరిశీలించిన అనంతరం తుది నివేదిక వెలువడనుంది. దీనికి కనీసం మరో రెండు వారాల సమయం పట్టవచ్చని అంచనా.

చదవండి: Electric Scooter: మంటల్లో కాలిపోయిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

మరిన్ని వార్తలు