EVeium: ఆ హై-స్పీడ్ ఈ-స్కూటర్లు వచ్చేశాయిగా.. ఫీచర్లు, ధర?

19 Jul, 2022 13:09 IST|Sakshi

ప్రారంభ ధర రూ.  1.44 లక్షలు

సాక్షి, ముంబై:  ఈవీయం మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ ఆధారిత మెటా4కి  చెందిన ఆటో విభాగం ఎల్లీసియం ఆటోమోటివ్స్‌  ఈవీయం పేరుతో కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.  కాస్మో, కామెట్ , జార్  అనే పేరుతో వీటిని తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా( ఎక్స్-షోరూమ్) వరుసగా  రూ. 1.44 లక్షలు, రూ.1.92 లక్షలు, 2.16 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.   వీటి బుకింగ్‌లు ఆగస్టు 8 నుంచి  మొదలు కానున్నాయి.

మూడు ఇ-స్కూటర్లు ఒకే 72V 31 Ah లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తితో పని చేస్తాయి.  అయితే  వీటి మైలేజీ, పరిధి, ఛార్జింగ్‌ టైం,  ఎలక్ట్రిక్ మోటారు భిన్నంగా ఉంటాయి. కాస్మో,   కామెట్ రెండూ 2000W ఎలక్ట్రిక్ మోటార్‌తో వచ్చినప్పటికీ, టాప్-ఆఫ్-ది-లైన్ జార్ 4000W ఎలక్ట్రిక్ మోటారుతో వచ్చింది. జార్, కామెట్ రెండూ ఒకే ఛార్జ్‌పై 150 కి.మీ పరిధిని, కాస్మో ఒకే ఛార్జ్‌తో 80 కి.మీ పరిధిని అందిస్తాయి. 

ఈ స్కూటర్లు స్పీడ్ మోడ్‌లు (ఎకో, నార్మల్, స్పోర్ట్స్‌) లభ్యం.  కీలెస్ స్టార్ట్, యాంటీ-థెఫ్ట్ ఫీచర్, లేటెస్ట్‌ LCD డిస్‌ప్లే, రీజెనరేటివ్ బ్రేకింగ్, మొబైల్ యాప్ కనెక్టివిటీ, రియల్ టైమ్ ట్రాఫికింగ్, ఓవర్-స్పీడ్ అలర్ట్, జియోఫెన్సింగ్,   లొకేట్‌ మై వెహికల్ ఫీచర్లు  ప్రధానంగా ఉన్నాయి. కాస్మో  అతి తక్కువ వేగాన్ని గంటకు 65 కి.మీ, కామెట్, జార్ రెండూ గంటకు 85 కిలీమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. భారతీయ మార్కెట్‌లో తమ బ్రాండ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, తమ మూడు  ఈ-స్కూటర్లు వినియోగదారుల మనసు దోచుకుంటాయని విశ్వసిస్తున్నామని కంపెనీ  ప్రమోటర్  ముజమ్మిల్ రియాజ్ తెలిపారు.


 

మరిన్ని వార్తలు