మైనర్ల పేరుతో పీఓఎమ్‌ఐఎస్‌ ఖాతా తెరవొచ్చు

5 Jul, 2021 15:21 IST|Sakshi

జూన్-సెప్టెంబర్ త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకుండా య‌థాత‌థంగా ఉంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడి పెట్టిన వారు ఏడాదికి 6.6 శాతం వడ్డీ రేటును పొందనున్నారు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం(పీఓఎమ్‌ఐఎస్‌) అనేది పొదుపు పథకం. దీనిలో మీరు పెట్టుబడి పెట్టిన నిర్ధిష్ట మొత్తంపై ప్రతి నెలా స్థిర వడ్డీని పొందవచ్చు. మీ దగ్గరలోని పోస్టాఫీసులో పీఓఎమ్‌ఐఎస్‌ ఖాతాను తెరవవచ్చు. 

ఏ భారతీయ నివాసి అయినా పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్‌ ఖాతా తెరవవచ్చు. అలాగే, ముగ్గురు వయోజనులు ఉమ్మడిగా కూడా ఖాతాను తెరవవచ్చు. మీరు కనుక మీ పిల్లల పేరు మీద కొత్త మొత్తం పొదుపు చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మీ మైనర్ల పేరిట పీఓఎమ్‌ఐఎస్‌ ఖాతాను తెరవవచ్చు.

డిపాజిట్లు
ఈ ఖాతాతెరవడానికి అవసరమైన కనీస మొత్తం ₹1,000, గరిష్టంగా ₹4.5 లక్షలను మాత్రమే సింగిల్ హోల్డర్ ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు. ఉమ్మడి ఖాతాలో పరిమితి ₹9 లక్షలు మించి పెట్టుబడి పెట్టలేరు. ఉమ్మడి ఖాతా హోల్డర్లు సమాన వాటాను ప్రతి నెల పొందుతారు.

వడ్డీ రేట్లు
ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తరువాత వడ్డీ చెల్లించడం మొదలు అవుతుంది. ఇది మెచ్యూరిటీ వరకు కొనసాగుతుంది. మీరు ప్రతి నెలా చెల్లించే వడ్డీని క్లెయిం చేసుకోనట్లయితే, అటువంటి వడ్డీ ఎలాంటి అదనపు వడ్డీనిపొందలేరు. అంతేగాక, ఫిక్సిడ్ లిమిట్లకు మించి ఎక్కువ డిపాజిట్ చేస్తే రీఫండ్ చేయబడుతుంది. డిపాజిట్ చేయబడ్డ అదనపు మొత్తంపై పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ కు వర్తించే వడ్డీ రేటు వర్తిస్తుంది. మీరు ఆటో క్రెడిట్ ఆప్షన్ ఎంచుకుంటే ప్రతినెల వడ్డీని మీ సేవింగ్స్ ఖాతాలోకి పొందవచ్చు. అయితే ఈ వ‌డ్డీ ప‌న్ను ప‌రిధిలోకి వస్తుంది. అంటే ఈ వడ్డీ మొత్తం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ వ‌ర్తించ‌దు.

మెచ్యూరిటీ:
మీరు పోస్టాఫీసులో ఖాతా తెరిచిన ఐదు సంవత్సరాల తర్వాత ఖాతాను క్లోజ్ చేయవచ్చు. అయితే, ఒకవేళ మీరు పీఓఎమ్‌ఐఎస్‌ అకౌంట్ మెచ్యూరిటీకి ముందే మరణించినట్లయితే, దానిని క్లోజ్ చేయవచ్చు. మీరు చేసిన డిపాజిట్ నామినీ లేదా లీగల్ వారసులకు రీఫండ్ చేయబడతాయి. అలాంటప్పుడు, వడ్డీని మునుపటి నెల వరకు మాత్రమే చెల్లిస్తారు. ఖాతా తెరచేటప్పుడు, మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరునైనా నామిని కింద నమోదు చేయాలి, తద్వారా ఒకవేళ మీరు ఖాతా కాలవ్యవధిలో మరణించినట్లయితే, వారు ఈ ప్రయోజనాలను క్లెయిం చేసుకోవచ్చు.

డిపాజిట్ తేదీ నుంచి గడువు ముగియడానికి ఒక సంవత్సరం ముందు ఎలాంటి డిపాజిట్ విత్ డ్రా చేయరాదని మీరు గుర్తుంచుకోవాలి. అయితే, ఒక సంవత్సరం తర్వాత, మూడు సంవత్సరాలకు ముందు ముందస్తుగా ఖాతా క్లోజ్ చేసినట్లయితే, ప్రిన్సిపాల్ నుంచి 2 శాతం తగ్గించి మిగిలిన మొత్తం మీకు చెలిస్తారు. ఒకవేళ ఖాతా మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్య క్లోజ్ చేసినట్లయితే, ప్రిన్సిపాల్ నుంచి 1 శాతం తగ్గించి మిగిలిన మొత్తం మీ ఖాతాలో జమ చేస్తారు.

చదవండి: చిన్న పొదుపు పథకాల ఆదాయంపై పన్ను ఎంతో తెలుసా?

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు