ఎవరెడీ అలి్టమా బ్యాటరీలు

29 Sep, 2023 05:43 IST|Sakshi

కోల్‌కత: బ్యాటరీలు, లైటింగ్‌ ఉత్పత్తుల తయారీలో ఉన్న ఎవరెడీ ఇండస్ట్రీస్‌ అలి్టమా బ్రాండ్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. జింక్‌ బ్యాటరీలతో పోలిస్తే అలి్టమా శ్రేణి 400 శాతం అధిక శక్తిని కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. అలి్టమా ప్రో శ్రేణి 800 శాతం ఎక్కువ శక్తిని అందిస్తాయని వెల్లడించింది. అనుకూల రుతుపవనాల కారణంగా అక్టోబర్‌–మార్చి కాలంలో 13–14 శాతం వృద్ధి సాధిస్తామని ఎవరెడీ ఎండీ సువమోయ్‌ సాహ వెల్లడించారు. 2022–23లో 14 శాతం వృద్ధి నమోదైందన్నారు.

‘కంపెనీ అమ్మకాల్లో డ్రై సెల్‌ బ్యాటరీ విభాగంలో ప్రీమియం ఉత్పత్తుల వాటా 4–5 శాతం ఉంది. మూడు నాలుగేళ్లలో ఇది రెండింతలకు చేరుతుంది. నూతన ఉపకరణాల రాకతో అధిక శక్తిని అందించే బ్యాటరీలకు డిమాండ్‌ పెరగడమే ఈ వృద్ధికి కారణం. బ్యాటరీల విపణిలో ప్రీమియం విభాగం ఆరు శాతమే. ఏటా ఈ విభాగం 25 శాతం అధికం అవుతోంది. రూ.3,000 కోట్ల భారత బ్యాటరీల మార్కెట్లో ఎవరెడీ ఏకంగా 53 శాతం వాటా కైవసం చేసుకుంది’ అని వివరించారు. ఎవరెడీ ఇండస్ట్రీస్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.363 కోట్ల టర్నోవర్‌పై రూ.24 కోట్ల నికరలాభం ఆర్జించింది. ముడి సరుకు ధరలు స్వల్పంగా తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలు 2.5–3 శాతం మెరుగు పడతాయని కంపెనీ ఆశిస్తోంది.  

మరిన్ని వార్తలు