వాహనదారులకు బంపరాఫర్‌, ఫ్రీగా 50 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ పొందొచ్చు

12 Jan, 2022 19:48 IST|Sakshi

దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వాహనదారులకు తలకు మించిన భారంగా మారింది. దీంతో వాహనదారులు ఇంధన వెహికల్స్‌ నుంచి ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోవెహికల్స్‌ వాహనదారుల్ని అట్రాక్ట్‌ చేసేందుకు ఆయా సంస్థలు బంపరాఫర్లను ప్రకటిస్తున్నాయి.

తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియన్‌ ఆయిల్‌ సంస్థలు సంయుక్తంగా ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ ఆఫర్‌ను వినియోగించుకున్న వాహనదారులు సంవత్సరానికి 50 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ఉచితంగా పొందవచ్చు. అయితే ఇప్పుడు ఆ ఆఫర్ ఏంటో తెలుసుకుందాం? 

ఇండియన్ ఆయిల్ అవుట్‌లెట్‌లలో ఇండియన్‌ ఆయిల్‌ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో పెట్రోల్‌, డీజిల్‌పై ఖర్చుచేస్తే అందులో 5శాతం ఫ్యూయల్ పాయింట్‌లుగా సంపాదించవచ్చు. తద్వారా సంవత్సరానికి 50లీటర్లను పెట్రోల్‌ లేదా డీజిల్‌ను ఉచితంగా పొందవచ్చు. 

మొదటి 6 నెలల్లో నెలకు గరిష్టంగా 250 ఫ్యూయల్ పాయింట్‌లు, కార్డ్ జారీ చేసిన 6 నెలల తర్వాత గరిష్టంగా 150 ఫ్యూయల్ పాయింట్‌లను సంపాదించవచ్చు.  
                                                           
5శాతం కిరాణా, బిల్లు చెల్లింపులపై ఫ్యూయల్‌ పాయింట్‌లు లభిస్తాయి.  

ప్రతి కేటగిరీలో నెలకు గరిష్టంగా 100 ఫ్యూయల్‌ పాయింట్‌లను పొందవచ్చు. 

క్రెడిట్‌ కార్డ్‌తో ఇతర కొనుగోళ్లపై ఖర్చు చేసే ప్రతి రూ.150కి 1 ఫ్యూయల్ పాయింట్‌ని పొందవచ్చు

ఈ ఆఫర్‌లో అదనంగా 'ఇండియన్‌ ఆయిల్‌ ఎక్స్‌ట్రా రివార్డ్స్‌ టీఎం' ప్రోగ్రామ్‌లో మెంబర్‌షిప్‌ పొందవచ్చు.ఇలా ఇండియన్‌ ఆయిల్‌ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు వినియోగించడం ద్వారా వచ్చే రివార్డ్‌ పాయింట్స్‌ వాహనదారులు సంవత్సరానికి 50 లీటర్ల పెట్రోల్‌, లేదా డీజిల్‌ను ఉచితంగా పొందవచ్చు' అని ఇండియన్‌ ఆయిల్‌ హెచ్‌డీఎఫ్‌సీ సంస్థలు తెలిపాయి. మరిన‍్ని వివరాల కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

చదవండి: భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్‌ మార్కెట్‌లో రేట్లు ఇలా..!

మరిన్ని వార్తలు