సీఈవో అండదండలున్న నో జాబ్‌ గ్యారెంటీ!

21 Aug, 2023 22:25 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భ‌యాలు, తగ్గిపోతున్న ప్రాజెక్ట్‌లతో పాటు ఇతర కారణాల వల్ల చిన్న చిన్న స్టార్టప్‌ల నుంచి అంతర్జాతీయ టెక్‌ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. లేఆఫ్స్‌ తెగుబడుతున్న సంస్థలు సామర్ధ్యం పేరుతో వారిని బలి చేస్తున్నాయి. అయితే, తాజాగా పనితీరు బాగున్నా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ ఏడాది మేలో మెటా సంస్థ సుమారు 6000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారిలో ఓ ఉద్యోగి మెటాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని లింక్డిన్‌లో పోస్ట్‌ చేశారు. మెటాలో ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తూ టాప్‌ పెర్మార్లలో ఒకరిగా నిలిచారు. పనితీరు విషయంలో సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ ప్ర‌శంస‌లు సైతం అందుకున్నారు. కానీ కంపెనీలో చేరిన ఏడాదిన్నర తర్వాత విధుల నుంచి తొలగించినట్లు వాపోయారు.  

టాప్‌ పెర్ఫామర్‌, సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ ప్రశంసలతో మెటాలో తన జాబ్‌కు ఢోకా ఉండదని భావించారు. కానీ అనూహ్యంగా 6,000 లేఆఫ్స్‌లో తాను ఒకరిగా ఉండటాన్ని నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం, వేరే జాబ్‌ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు లింక్డిన్‌ పోస్ట్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు