లాజిస్టిక్స్‌ వ్యయాలు తగ్గుతాయి

23 May, 2022 00:56 IST|Sakshi

పెట్రోల్, డీజిల్‌ సుంకాల తగ్గింపుపై ఎగుమతిదారుల హర్షం

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై సుంకాలతో పాటు ప్లాస్టిక్, స్టీల్‌ మొదలైన వాటికి సంబంధించిన ముడి సరుకులపై కస్టమ్స్‌ డ్యూటీలను తగ్గించడం వల్ల లాజిస్టిక్స్‌ వ్యయాలు దిగివచ్చేందుకు వీలవుతుం దని ఎగుమతిదారులు తెలిపారు. తయారీలో పోటీతత్వం మెరుగుపడేందుకు, విలువను జోడించిన ఉత్పత్తుల ఎగుమతులకు తోడ్పడగలదని పేర్కొన్నారు. అలాగే దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గగల దని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేష న్స్‌ (ఎఫ్‌ఐఈవో) ప్రెసిడెంట్‌ ఎ. శక్తివేల్‌ తెలిపారు.

టెక్స్‌టైల్స్‌ ముడి వనరుల విషయంలోనూ ఇదే తరహా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పత్తి ఎగుమతులపై సుంకాలు విధించి, కాటన్‌ యార్న్‌ దిగుమతులపై సుంకాలు ఎత్తివేస్తే దేశీ పరిశ్రమలకు సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నా రు. పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై లీటరుకు రూ. 6 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఉక్కు, ప్లాస్టిక్‌ ముడి సరుకులకు సంబంధిం చి దిగుమతి సుంకాలను కూడా తగ్గించిన కేంద్రం.. ముడి ఇనుము, ఉక్కు ఇంటర్మీడియట్స్‌పై ఎగుమతి సుంకాన్ని పెంచింది.

మరిన్ని వార్తలు