రూ.1.41 లక్షల కోట్ల ఎగుమతులు

19 Apr, 2022 22:17 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎగుమతులు మంచి వృద్ధిని చూస్తునాయి. ఏప్రిల్‌ మొదటి రెండు వారాల్లోనే 1 నుంచి 14వ తేదీ వరకు 18.79 బిలియన్‌ డాలర్ల విలువ మేర (సుమారు రూ.1.41 లక్షల కోట్లు) ఎగుమతులు జరిగాయి. 

పెట్రోలియం, ఆభరణాలు, రత్నాలు ఎగుమతుల వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. గతేడాది ఏప్రిల్‌ 1–14 మధ్య ఎగుమతులు 13.72 బిలియన్‌ డాలర్లుగానే ఉండడం గమనించాలి.

 ఇక ఈ నెల 1–14 మధ్యకాలంలో దిగుమతులు 12 శాతం పెరిగి 25.84 బిలియన్‌ డాలర్లుగా (రూ.1.94 లక్షల కోట్లు) నమోదైనట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యాలయం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2021–22లో మొత్తం ఎగుమతులు రికార్డు స్థాయిలో 420 బిలియన్‌ డాలర్లు. దిగుమతులు 612 బిలియన్‌ డాలర్లు. 

మరిన్ని వార్తలు