Nano Cams: సంచలన ఆవిష్కరణ.. ఇక స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా బంప్స్ కనపడవు!

2 Jan, 2022 18:58 IST|Sakshi

ప్రస్తుత స్మార్ట్ టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ఫోన్‌ ఇల్లు లేదు అని చెప్పుకోవడంలో పెద్ద అతిశయోక్తి లేదు. అంతలా విస్తరించింది, ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచం. అయితే, ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌ కొనే ముందు తప్పక చూసే ఫీచర్స్‌లలో కెమెరా అనేది చాలా ముఖ్యమైనది. ఈ మధ్య కొన్ని కంపెనీలు యూజర్లను ఆకట్టుకోవడం కోసం పెద్ద, పెద్ద కెమెరాల గల స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఇవీ, పనితీరు పరంగా చూస్తే బాగానే ఉన్న, చూడాటానికి అంత బాగుండటం లేదు. దీనికి, ముఖ్య కారణం మన స్మార్ట్‌ఫోన్‌ కెమెరాల వెనుక ఉండే పెద్ద, పెద్ద కెమెరా బంప్స్.

ఇలా కెమెరా బంప్స్ పెద్దగా ఉండటం వల్ల కొన్నిసార్లు స్మార్ట్‌ఫోన్‌ లుక్ కూడా దెబ్బతింటుంది. అయితే, ఈ సమస్యకు చెక్ పెడుతూ.. ప్రిన్స్టన్, వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చారు. మన స్మార్ట్‌ఫోన్‌లు నానో కెమెరాలతో త్వరలో రానున్నాయి. మీరు నానో కెమెరా సైజ్ గురుంచి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది చూడాటానికి చిన్నగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రోబోటిక్స్ టెక్నాలజీ సహాయంతో నానో కెమెరాలను తయారు చేయవచ్చు అని పరిశోధకులు అన్నారు. ఈ అత్యంత చిన్న కెమెరాలో 1.6 మిలియన్ స్థూపాకార పోస్ట్లు ఉన్నాయి. ఇవి కాంతిని ప్రాసెస్ చేయడానికి సహాయపడతాయి. 

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే?, ఈ నానో కెమెరా చిప్‌ను సంప్రదాయ కంప్యూటర్ చిప్స్ లాగా ఉత్పత్తి చేయవచ్చు. ఇవి అల్గోరిథంలపై ఆధారపడి పనిచేస్తాయి. నేచర్ కమ్యూనికేషన్స్లో  వచ్చిన కథనం ప్రకారం.. నానో కెమెరాల కొత్త జెన్ ఔషధం, రోబోటిక్స్ లో ఉపయోగించే ప్రస్తుత నానో కెమెరా టెక్నాలజీతో సహాయంతో పనిచేస్తాయి. కొత్త నానో కెమెరాలతో చిత్రాలను సంప్రదాయ కెమెరాలతో సమానంగా పరిశోధకులు తీయగలిగారు. ఈ నానో కెమెరాలలో ఉపయోగించే కొత్త టెక్నాలజీని "మెటాసర్ఫేస్" అని పిలుస్తారు. దీనిలో సంప్రదాయ కెమెరా లోపల వక్రమైన కటకాలను నానో క్యామ్ ల ద్వారా ఉంచుతారు. ఇవీ, కేవలం అర మిల్లీమీటర్ వెడల్పుతో ఉంటాయి. పనితీరు పరంగా చూసిన ఇప్పుడు ఉన్న కెమెరాలతో సరిసమానంగా పనిచేస్తాయి అని వారు తెలిపారు. 

(చదవండి: ఆండ్రాయిడ్‌ 13 ఫీచర్లు లీక్‌, వారెవ్వా.. అదరగొట్టేస్తున్నాయ్‌!)

మరిన్ని వార్తలు