ఆగస్టు 4న రెండు ఐపీఓలు...

31 Jul, 2021 02:29 IST|Sakshi

దేవయాని ఇంటర్నేషనల్‌

ముంబై: భారత్‌లో అతిపెద్ద ఫాస్ట్‌ఫుడ్‌ ఫ్రాంచైజీ సంస్థ దేవయాని ఇంటర్నేషనల్‌ ఐపీఓకు సిద్ధమైంది. ఇష్యూ ఆగస్ట్‌ 4న మొదలై., అదే నెల ఆరవ తేదిన ముగుస్తుంది. ఐపీఓకు ధరల శ్రేణి రూ.86–90గా నిర్ణయించి మొత్తం రూ.1,838 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.440 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. అలాగే ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లు 15 కోట్ల ఈక్విటీలను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా అమ్మకానికి పెట్టారు. మొత్తం 165 షేర్లను కలిపి ఒక లాట్‌గా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ ఉద్యోగులకు ప్రత్యేకంగా 5.50 లక్షల ఈక్విటీలకు కేటాయించారు. సమీకరించిన నిధులను రుణాలను తీర్చేందుకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగిస్తామని కంపెనీ తెలిపింది.

ఎక్సారో టైల్స్‌
ముంబై: గుజరాత్‌కు చెందిన వెర్టిఫైడ్‌ టెల్స్‌ తయారీ సంస్థ ఎక్సారో టైల్స్‌ ఐపీఓ ఆగస్ట్‌ 4న ప్రారంభం కానుంది. అదే నెల 6వ తేదీన ముగిస్తుంది. ధర శ్రేణి రూ.118–120గా నిర్ణయించారు. ఇష్యూలో భాగంగా కంపెనీ 1,342,4000 తాజా షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్‌ దీక్షిత్‌కుమార్‌ పటేల్‌ 22.38 లక్షల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా అమ్మకానికి పెట్టారు. మొత్తం 125 షేర్లను కలిపి ఒక లాట్‌ నిర్ణయించారు. ఇన్వెస్టర్లు రూ.15వేలు చెల్లించి ఒక లాట్‌ను సొంతం చేసుకోవచ్చు. షేర్లను ఆగస్ట్‌ 16వ తేదిన ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ చేయాలని కంపెనీ భావిస్తోంది. పంథోమత్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ సంస్థ ఈ ఇష్యూకు లీడింగ్‌ బుక్‌ మేనేజర్‌గా వ్యవహరించనుంది. ఎక్సారో టైల్స్‌ 27 రాష్ట్రాల్లో విస్తరించింది. సుమారు 2000లకు పైగా డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. 

మరిన్ని వార్తలు