ఫార్ములా వన్‌ రేసులు.. సంచలన నిర్ణయం

19 Oct, 2021 14:19 IST|Sakshi

అసలే ఇంధన ధరలు మండిపోతున్నాయి. దీనికితోడు ఆ ఇంధనాల వల్ల కాలుష్యం పెరిగి పర్యావరణానికి మరింత హాని చేస్తోంది.  ఈ తరుణంలో వచ్చే ఫార్ములా వన్‌ సీజన్‌ కోసం ఎఫ్‌ఐఏ (ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ఆటోమొబైల్‌) సంచలన నిర్ణయం తీసుకుంది.  


అంతర్జాతీయ అత్యున్నత ఆటో రేసింగ్‌ ఫార్ములా వన్‌ తరపున ఎఫ్‌ఐఏ అభినందనీయమైన నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్‌లో స్థిరమైన ఇంధనాలు(sustainable fuels).. అదీ సెకండ్‌ జనరేషన్‌ బయోఫ్యూయల్‌ మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. తద్వారా కాలుష్యాన్ని తగ్గించే పనిలో పడింది. ఈ నిర్ణయంతో వచ్చే ఏడాది నుంచి ఈ10 ఫ్యూయల్‌ ఉపయోగించనున్నారు. అయితే ఇప్పటిదాకా ఉపయోగిస్తున్న ఇంధన వనరుల వ్యాపార ఒప్పందాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపించనుంది. 2022 ఎఫ్‌వన్‌ సీజన్‌ మార్చ్‌ 20న బహ్రయిన్‌లో మొదలై.. నవంబర్‌ 20న అబుదాబిలో ముగియనుంది. 

  
ఇక చాలా ఏళ్లుగా రేసింగ్‌లో ఉపయోగించే ఇంధనాల వల్ల కాలుష్యం పెరుగుతోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో ఇంధనాల్లో ఇథనాల్‌ మిక్సింగ్‌ మోతాదును పెంచాలని నిర్ణయించారు. రానున్న పదేళ్లకల్లా జీరో కార్బన్‌ లక్క్ష్యంగా పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది ఎఫ్‌ఐఏ. 2025, 2026 నాటికల్లా 100 శాతం స్థిరమైన ఇంధనాలు (sustainable fuels) ఉపయోగ సాధన దిశగా ఎఫ్‌ఐఏ అడుగులు వేస్తోంది.

చదవండి: ఫార్ములా వన్‌.. సెంచరీ విక్టరీల వీరుడు ఎవరో తెలుసా?

మరిన్ని వార్తలు