ఫ్యాబిండియా ఐపీవో రద్దు

28 Feb, 2023 01:35 IST|Sakshi

ముసాయిదా ప్రాస్పెక్టస్‌ ఉపసంహరణ

న్యూఢిల్లీ: కళాత్మక వస్తువులు, లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తుల రిటైల్‌ రంగ కంపెనీ ఫ్యాబిండియా పబ్లిక్‌ ఇష్యూ యోచనను విరమించుకుంది. ప్రస్తుత మార్కెట్‌ ఆటుపోట్ల నేపథ్యంలో ఐపీవో ద్వారా రూ. 4,000 కోట్ల సమీకరణ ప్రణాళికలను రద్దు చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. వెరసి క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది.

ఇష్యూ పరిమాణంరీత్యా ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు అనుకూలంగా లేనట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ఐపీవో ద్వారా 2.5 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయాలని భావించింది. ప్రాస్పెక్టస్‌ గడువు 2023 ఏప్రిల్‌తో ముగియనున్న నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎన్‌సీడీల స్వచ్చంద చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు నిధులను వెచ్చించాలని కంపెనీ తొలుత ప్రణాళికలు వేసింది.

మరిన్ని వార్తలు