మార్ఫింగ్‌ ఫోటోలు, వీడియోలకు చెక్‌ పడనుందా..!

17 Jun, 2021 17:20 IST|Sakshi

ఇంటర్నెట్‌ యుగంలో సాంకేతికతతో ఎన్ని లాభాలు ఉన్నాయో..అంతే స్థాయిలో దుష్ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. కొంతమంది తమ స్వప్రయోజనాలకోసమో లేదా ఇతరులపై పగ పెంచుకోవడం వలనో  సాంకేతికతను ఉపయోగించి వారి చిత్రాలను, వీడియోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంల్లో సర్య్కూలేట్‌ చేస్తుంటారు. దీనిలో ఎక్కువగా అమ్మాయిలు బాధితులుగా ఉంటారు.  కాగా ప్రస్తుతం భవిష్యత్తులో ఫేస్‌బుక్‌ తెస్తోన్న టెక్నాలజీతో ఫేక్‌ చిత్రాలను, వీడియోలు తీసే ఆగంతకులకు చెక్‌ పెట్టవచ్చును. ఫేస్‌బుక్‌ శాస్త్రవేత్తలు తెస్తోన్న టెక్నాలజీతో ప్రస్తుతం డీప్‌ఫేక్‌ చిత్రాలను, వీడియోలను గుర్తించడమే కాకుండా అవి ఎ‍క్కడ నుంచి వచ్యాయో ఇట్టే పసిగడుతుంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేయనున‍్నట్లు తెలుస్తోంది. 


మార్పింగ్‌ చేయబడిన చిత్రం

ఫేస్‌బుక్‌ పరిశోధన శాస్త్రవేత్తలు టాల్ హాస్నర్, జి యిన్ మాట్లాడుతూ.. ఈ టెక్నాలజీపై  మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీతో కలిసి చేశామని, రివర్స్‌ ఇంజనీరింగ్‌ ద్వారా డీప్ ఫేక్ చిత్రాలను ఎలా తయారు చేశారో, అవి ఎక్కడ నుంచి ఉద్భవించాయో తెలుసుకోవడానికి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామని తెలిపారు.ఈ సాఫ్ట్‌వేర్‌తో  డీప్‌ఫేక్‌ చిత్రాలను, వీడియోలను పోస్ట్‌ చేసిన వారి వివరాలు సులువుగా  ట్రేస్‌ చేయవచ్చునని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫేక్‌ చిత్రాలు, వీడియోలు తీసేవారి ఆటలు ఇకాపై సాగవనే అభిప్రాయాన్ని వ్యక్తం  చేశారు. 

కాగా, మైక్రోసాఫ్ట్ గత సంవత్సరం చివర్లో డీప్ ఫేక్ ఫోటోలు లేదా వీడియోలను గుర్తించడంలో సహాయపడే సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది, ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన హింసకాండలో క్లిష్టమైన ఫేక్‌ చిత్రాలను గుర్తించడానికి ఎంతగానో ఉపయోగపడింది.  ప్రస్తుతం ఫేస్‌బుక్‌ సంస్థ వీడియో అథెంటికేటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఒక చిత్రాన్ని లేదా వీడియోలోని ప్రతి ఫ్రేమ్‌ను విశ్లేషించి, వాటిని ఎవరు చేశారనే విషయాన్ని గుర్తుపట్టనుంది. 

అసలు ఈ డీప్‌ ఫేక్‌ మీడియా అంటే..
ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెంట్‌ టూల్‌ను ఉపయోగించి ఇతర వ్యక్తుల ఫోటోల్లో, వీడియోల్లో నచ్చని వారి ఫోటోలను చొప్పించి, నకిలీ చిత్రాలను, విడియోలను తయారు చేసే సింథటిక్‌ మీడియా. ప్రస్తుతం కింద చూస్తున్న వీడియో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ది. ఈ వీడియోను డీప్‌ఫేక్‌ సింథటిక్‌ మీడియాగా చేసి ఇంటర్నెట్‌లో వదిలారు. ఇలాంటి వీడియోలతో తీవ్రమైన కల్లోలాలు చేలరేగుతాయి. కాగా ఇలాంటి డీప్‌ఫేక్‌ వీడియోలను భవిష్యత్తులో ఫేస్‌బుక్‌ వాటిని గుర్తించి, క్రియేటర్ల పేరును బయటపెట్టనున్నారు. 

చదవండి: శరీరాన్ని ఉపయోగించి స్మార్ట్‌వాచ్‌ ఛార్జింగ్‌..!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు