Facebook: ఫేస్‌బుక్‌లో మరో సూపర్‌ ఫీచర్‌, వాయిస్‌,వీడియో కాలింగ్‌

24 Aug, 2021 13:21 IST|Sakshi

మనం ఫోన్‌ తో చేసే వాయిస్‌ కాల్‌, వీడియోకాల్‌ను ఇకపై ఫేస్‌ బుక్‌ నుంచి చేసే అవకాశం ఉంది. ఎస్‌. ఫేస్‌ బుక్‌ ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఆ సంస్థ సీఈఓ మార్క్‌ జూకర్‌ బెర్గ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా యుజర్లను మరింత అట్రాక్ట్‌ చేసేందుకు వాయిస్‌ - వీడియా కాలింగ్‌ ఆప్షన్‌ పై వర్క్‌ చేస్తున్నారని బ్లూమ్‌ బెర్గ్‌ తెలిపింది. 

వాస్తవానికి ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌..'ఫేస్‌బుక్‌ మెసేంజర్‌'కు అటాచ్‌ చేసింది. దీంతో యూజర్లు వీడియో కాలింగ్‌ చేసుకోవాలంటే ఫేస్‌బుక్‌ మెయిన్‌ పేజ్‌ను క్లోజ్‌ చేసి  మెసేంజర్‌లోకి వెళ్లేవారు. అలా వెళ్లడం వల్ల యూజర్లు ఫేస్‌బుక్‌ ను వినియోగించడం తగ్గిస్తున్నారని మార్క్‌ జూకర్‌ బెర్గ్‌ గుర్తించారు.  

అయితే అప్పటి వరకు ఒకటిగా ఉన్న ఫేస్‌ బుక్‌ ను - ఫేస్‌ బుక్‌ మెసెంజర్‌ ను 2014లో వేరు చేశారు. వాయిస్‌ - వీడియో కాలింగ్‌ ఆప్షన్‌ ను ఫేస్‌ బుక్‌ మెసెంజర్‌కు జోడించారు. ఇప్పుడు మళ్లీ ఇదే ఫీచర్‌ ను  ఫేస్‌బుక్‌ డెవలప్‌ చేసే పనిలో పడిందని బ్లూమ్‌ బెర్గ్‌ తన కథనంలో ప్రస్తావించింది.త్వరలో ఈ ఫీచర్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి  రానుందని పేర్కొంది. 

మరిన్ని వార్తలు