Facebook: ఫేస్‌బుక్‌కు మరో షాక్‌..! ఈ సారి రష్యా రూపంలో..!

5 Oct, 2021 20:54 IST|Sakshi

మాస్కో:  ప్రపంచవ్యాప్తంగా ఏడు గంటలపాటు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ను తిరిగి పునరుద్దరించడంలో ఫేస్‌బుక్‌ నానాఅవస్థలు పడింది. కొంతమంది యూజర్లు ఫేస్‌బుక్‌పై దుమ్మెతిపోశారు. ఫేస్‌బుక్‌ను వెంటనే స్మార్ట్‌ఫోన్ల నుంచి  ఆన్‌ఇన్‌స్టాల్‌ చేయాలంటూ ట్విటర్‌లో యూజర్లు ట్రెండింగ్‌ చేశారు. యూజర్లే కాకుండా పలు సోషల్‌నెట్‌వర్కింగ్‌ సైట్స్‌ కూడా ఫేస్‌బుక్‌ను విపరీతంగా ట్రోల్‌ చేశాయి.  తాజాగా ఫేస్‌బుక్‌కు మరో  షాక్‌  తగిలింది. ఈ సారి రష్యా రూపంలో ఫేస్‌బుక్‌కు గట్టి ఝలక్‌ తగిలింది. 
చదవండి: FB, Whatsapp, Instagram Down: ట్విటర్‌లో యూజర్ల గోలాగోలా..! ఇవి చూస్తే నవ్వలేక చచ్చిపోవాల్సిందే..!

కొద్ది రోజుల క్రితం రష్యాలో చట్టవిరుద్ధమైనా కంటెంట్‌లను ఫేస్‌బుక్‌ తొలగించగా..ఐనా కూడా రష్యా ప్రభుత్వం ఫేస్‌బుక్‌పై భారీ జరిమానాను విధించనున్నుట్లు తెలుస్తోంది. కంటెంట్‌ను సరైన సమయంలో  తొలగించనందుకుగాను రష్యా  జరిమానాను వేయనుంది. రష్యా నిషేధించిన కంటెంట్‌ను తొలగించకపోతే ఫేస్‌బుక్ తన వార్షిక రష్యన్ టర్నోవర్‌లో 10శాతం వరకు జరిమానా విధిస్తామని రష్యన్‌ రెగ్యులేటర్, రోస్కోమ్నాడ్జోర్ గత వారం ఫేస్‌బుక్‌ను హెచ్చరించారు. రష్యా ఒత్తిడికి ఫేస్‌బుక్ తలవంచింది. ఫేస్‌బుక్‌ రష్యాలో సుమారు 165 మిలియన్‌ డాలర్ల నుంచి 538 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని పొందుతుంది. 

 రష్యాకు వ్యతిరేకంగా ఉన్న ఫేస్‌బుక్‌  1,043కంటెంట్లపై, ఇన్‌స్టాగ్రామ్‌లో 973 కంటెంట్‌లను  డిలీట్ చేయలేదని రష్యన్‌ ప్రభుత్వ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాదిలో నిషేధిత కంటెంట్‌ను తొలగించనందుకు గాను రష్యా ఫేస్‌బుక్‌పై భారీగా జరిమానాలను విధించింది. చైల్డ్ అశ్లీలత పోస్ట్‌లను తొలగించడంలో విఫలమవడం , మాదకద్రవ్యాల  ప్రోత్సహించడం వంటివి ఫేస్‌బుక్ ఉల్లంఘనలని రష్యన్ మీడియా నివేదించింది.
చదవండి: చిత్ర పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలికిన హాలీవుడ్‌..!

మరిన్ని వార్తలు