మహమ్మారి వెంటాడినా మెరుగైన ఫలితాలు

31 Jul, 2020 11:24 IST|Sakshi

ఫేస్‌బుక్‌కు భారీ రాబడి

శాన్‌ఫ్రాన్సిస్కో : కరోనా మహమ్మారితో పాటు విద్వేష కంటెంట్‌పై విమర్శలు వెల్లువెత్తినా పలు ప్రతికూలతల మధ్య సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ రెండో త్రైమాసంలో భారీ రాబడిని ఆర్జించింది. ఈ త్రైమాసంలో ఫేస్‌బుక్‌ రాబడి ఏకంగా 11 శాతం పెరిగి దాదాపు 1.3 లక్షల కోట్లకు ఎగిసింది. రెండో క్వార్టర్‌లో 314 కోట్ల మంది ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్‌, మెసెంజర్‌ వంటి ఎఫ్‌బీ యాప్స్‌ను ఉపయోగించుకున్నారు. డైలీ యాక్టివ్‌ యూజర్లు 12 శాతం పెరిగి 179 కోట్లకు చేరారు. అన్ని కంపెనీల తరహాలోనే తమ వ్యాపారం కూడా కోవిడ్‌-19తో ప్రభావితమైందని రాబోయే రోజుల్లో తమ వాణిజ్య పరిస్థితిపై అనిశ్చితి నెలకొందని ఫేస్‌బుక్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : ఫేస్‌బుక్‌కు కౌంటరిచ్చిన టిక్‌టాక్‌

అయితే రెండో క్వార్టర్‌లో మెరుగైన ఫలితాలు ప్రకటించడంతో స్టాక్‌ మార్కెట్లలో సోషల్‌ మీడియా దిగ్గజం షేర్లు ఏడు శాతం పైగా పెరిగాయి. కరోనా వైరస్‌ వెంటాడుతున్న సంక్లిష్ట సమయంలో చిన్న వ్యాపారం సంస్థలు ఎదిగేందుకు, ఆన్‌లైన్‌ కార్యకలాపాలు చక్కదిద్దుకునేందుకు అవసరమైన టూల్స్‌ అందిస్తామని ఫేస్‌బుక్‌ వ్యవస్ధాపకులు, సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. విద్వేష కంటెంట్‌ను నిలిపివేయడంపై ఫేస్‌బుక్‌ చర్యలు చేపట్టకపోవడంపై యాడ్‌ బ్యాన్‌ను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తప్పుడు సమాచారం, విద్వేష కంటెంట్‌ల నుంచి లాభాలు దండుకోవాలని తాము భావించడంలేదని జుకర్‌బర్గ్‌ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు