Facebook Horizon Workroom: అదిరిపోయే టెక్నాలజీని ఆవిష్కరించిన ఫేస్‌బుక్!

20 Aug, 2021 17:13 IST|Sakshi

గతేడాది వచ్చిన కరోనా మహమ్మారి పుణ్యమా అని డిజిటల్ టెక్నాలజీ ఎన్నడూ లేనంతగా వేగంగా విస్తరిస్తుంది. గతంలో అతి కొద్ది మందికి మాత్రమే పరిమితం అయిన వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానం నేడు ప్రతి ఐటీ కంపెనీ అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త డిజిటల్ టెక్నాలజీ వల్ల విద్యార్థులు ఇంట్లో నుంచే పాఠాలు వినడం, ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం జరుగుతుంది. అయితే, ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఎంతో కొంత మేలు జరుగుతున్నప్పటికి పూర్తి స్థాయిలో మాత్రం కాదు అని చెప్పుకోవాలి. 

ఇందులో ఉన్న సమస్యలను అధిగమిస్తూ ఫేస్‌బుక్ సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ టెక్నాలజీ పేరు "హారిజాన్ వర్క్ రూమ్". ఇది వర్చువల్ టెక్నాలజీ సహాయంతో పనిచేస్తుంది. ఫేస్‌బుక్ హారిజాన్ వర్క్ రూమ్ వల్ల మనం ఇంట్లో ఉన్నప్పటికీ పాఠశాలలో, ఆఫీస్ లో, ఇతర సమావేశాలలో పాల్గొన్న అనుభూతిని కలిగిస్తుంది. భౌతిక దూరంతో సంబంధం లేకుండా ఒకే వర్చువల్ రూమ్ లో కలిసి పాల్గొనవచ్చు.

మరో మాటలో చెప్పాలంటే, మీరు ఒక గదిని ఊహించుకొని ఆ గదిలో మీరు, మీ సహోద్యోగులు కలిసి సమావేశంలో పాల్గొన్న అనుభూతి ఈ టెక్నాలజీ కల్పిస్తుంది. ఇది వర్చువల్ రియాలిటీ, వెబ్ రెండింటిలోనూ పనిచేస్తుంది. మీరు, మీ బృందంతో భౌతికంగా కమ్యూనికేట్ అవ్వకుండానే వర్చువల్ పద్దతిలో వీఆర్ టెక్నాలజీ సహాయంతో కనెక్ట్ కావచ్చు. అలాగే, విద్యార్థులు ఇంట్లో ఉన్నప్పటికీ ఒక తరగతి గదిలో మీ టీచర్ చెప్పే పాఠాలను వినవచ్చు.(చదవండి: భార‌త సైనికుల చేతికి అత్యాధునిక AK 200 రైఫిల్స్)

>
మరిన్ని వార్తలు