33.3 మిలియన్ల కంటెంట్‌ ఇమేజ్‌లను తొలగించిన ఫేస్‌బుక్‌

1 Sep, 2021 11:52 IST|Sakshi

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అకౌంట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్‌ 16 నుంచి జులై 31 మధ్య కాలంలో సుమారు 33.3 మిలియన్ల కంటెంట్‌ పీస్‌ (ఇమేజ్‌)లను అకౌంట్ల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. 

యూజర్లు సేఫ్‌ అండ్‌ సెక్యూర్‌గా ఉండేందుకు ఫేస్‌ బుక్‌ గత కొంత కాలంగా యూజర‍్లు టెక్నాలజీ, ఏఐలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. తద్వారా ఫేస్‌ బుక్‌ యూజర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ఇమేజెస్‌, కంటెంట్‌లపై కన్నేసింది. ఈ రెండింటిలో  ఫేస్‌బుక్‌కు చెందిన 10 కంటెంట్‌ పాలసీ నిబంధనలతో పాటు ఆ సంస్థకు చెందిన మరో సోషల్‌ నెట్‌ వర్క్‌ ఇన్‌ స్టాగ్రామ్‌లో 8  పాలసీల నిబంధనల్ని ఉల్లంఘించిన అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. 

సోషల్‌ మీడియా వల్ల హింస పెరిగిపోతుందా?
కరోనా కారణంగా సోషల్‌ మీడియా వినియోగం రోజురోజుకి పెరిగిపోయింది. సరైన అవగాహన ఉన్నవారు మనీ ఎర్నింగ్‌ కోసం ఫేస్‌బుక్‌ను  ఓ వేదికగా మార్చుకుంటున్నారు. అదే సమయంలో మరికొందురు రెచ్చగొడుతూ హింసను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్‌లను భారీగా తొలగించామంటూ ఇటీవల ఫేస్‌బుక్‌ స్పోక్‌ పర్సన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 16 నుంచి జులై 31 మధ్య కాలంలో 25.6 మిలియన్ల ఇమేజ్‌ కంటెంట్‌, హింసను రెచ్చగొట్టేలా ఉన్న 3.5 మిలియన్ల గ్రాఫికల్‌ ఇమేజెస్‌పై, 2.6 మిలియన్ల అడల్ట్‌ కంటెంట్‌ ఉన్న ఇమేజెస్‌లను తొలగించినట్లు తెలిపారు. వీటితో పాటు 1లక్షా 23,400 హరాస్‌ మెంట్‌ కంటెంట్‌ ఉన్న అకౌంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు,1504 రిపోర్ట్‌ల ఫిర్యాదులు అందాయని వెల్లడించింది.       

ఫేస్‌బుక్కే కాదు.. ఇన్‌ స్టాగ్రామ్‌ లో కూడా.. 
ఫేస్‌బుక్కే కాదు..ఇన్‌ స్టాగ్రామ్‌ పోస్ట్‌లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌ యాజమాన్యం వెల్లడించింది. 1.1 మిలియన్ల హింసాత్మక పోస్ట్‌లు, 8,11,000 వేల సూసైడ్‌, సెల్ఫ్‌ ఇంజూరీ ఇమేజ్‌ కంటెంట్ లపై చర్యలకు ఉపక్రమించింది. జూన్‌ 16 నుంచి జులై 31 వరకు 265 అకౌంట్లపై యూజర్లు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.

వాట్సాప్‌ లో సైతం
ఫేస్‌బుక్‌ కు చెందిన మెసేజింగ్‌ ప్లాట్ ఫామ్‌ వాట్సాప్‌లో  జూన్‌ 16 నుంచి జులై 31 వరకు 3 మిలియన్‌ కంటే ఎక్కువ అకౌంట్లును తొలగించింది. ఇదే సమయంలో సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ కు 36,934 ఫిర్యాదులు అందగా..95,680 ఇమేజెస్‌ను తొలగించింది.  

చదవండి: ఇకపై ఈజీగా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను సొంతం చేసుకోవచ్చు!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు