లాగౌట్‌ సమస్యపై స్పందించిన ఫేస్‌బుక్

24 Jan, 2021 20:34 IST|Sakshi

ఫేస్‌బుక్ యూజర్లు తమ ప్రమేయం లేకుండానే అకౌంట్ నుంచి లాగౌట్ అయ్యినట్లు‌ చాలా మంది యూజర్లు శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తాము లాగౌట్ చేయకపోయిన ఫేస్‌బుక్ నుంచి ఆటోమేటిక్ గా లాగౌట్ అయ్యినట్లు కొందరు ఫేస్‌బుక్ కు పిర్యాదు చేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నం అయ్యింది. అయితే ఈ విషయంపై ఫేస్‌బుక్ స్పందించింది. "జనవరి 22న కాన్ఫిగరేషన్ మార్పు వలన కొంతమంది వారి ఫేస్‌బుక్ ఖాతాల నుంచి లాగౌట్ అయ్యారు. మేము ఈ సమస్యను కనుగొని పరిష్కరించాము, ఈ అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి" అని ఫేస్‌బుక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లాగ్-అవుట్ సమస్యకు ఐఫోన్ ఫేస్‌బుక్ వినియోగదారులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. లాగౌట్ అయిన తర్వాత తిరిగి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు టూ-స్టెప్-వెరిఫికేషన్ వల్ల అథెంటికేషన్‌ కోడ్స్‌ వారి మొబైళ్లకు రావడానికి చాలా సమయం పట్టింది అని యూజర్లు వాపోయారు.(చదవండి: ఇంట్లో నుంచే ఓటరు ఐడీ డౌన్‌లోడ్‌ చేసుకోండి)

మరిన్ని వార్తలు