సొంత ఆల్గారిథంతోనే FB నిఘా.. కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌తో చీకటి దందా!

9 Sep, 2021 07:53 IST|Sakshi

ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్.. వాట్సాప్‌ మొదటి నుంచి ఇస్తున్న భద్రత హామీ. యూజర్ల మధ్య జరిగే వాట్సాప్‌ చాట్‌, అందులోని ఇతరత్ర సమాచారం ఎట్టిపరిస్థితుల్లో మూడో మనిషి చేతికి వెళ్లదంటూ చెప్తూ వస్తోంది. అయితే వాట్సాప్‌ ఓనర్‌ కంపెనీ ఫేస్‌బుక్‌ ఈ విషయంలో  నైతిక విలువల్ని పక్కనపెట్టిందన్న ఆరోపణలు ఫేస్‌బుక్‌పై వెల్లువెత్తుతున్నాయి.

అమెరికా ఇన్వెస్టిగేషన్‌ మీడియా సంస్థ ‘ప్రొపబ్లికా ఇన్వెస్టిగేషన్‌’ కథనం ప్రకారం.. కోట్లలో యూజర్ల వాట్సాప్‌ అకౌంట్లపై ఫేస్‌బుక్‌ కన్నేసిందని, ఆస్టిన్‌, టెక్సాస్‌, డబ్లిన్‌, సింగపూర్‌లలో వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో ఈ వ్యవహారం నడిపిస్తోందని ఆరోపించింది. వాట్సాప్‌ నిఘాపై కన్నేయడంతో పాటు ఈ వ్యవహారం కోసం ఫేస్‌బుక్‌ తన సొంత ఆల్గారిథంనే ఉపయోగిస్తోందని ఈ కథనం వెల్లడించింది.

చదవండి: యూట్యూబ్‌ థంబ్‌నెయిల్స్‌ కన్నా దారుణంగా ఫేస్‌బుక్‌లో..

అయితే దొంగచాటుగా మెసేజ్‌లు చదువుతోందన్న ఆరోపణల్ని ఫేస్‌బుక్‌ ఖండించింది. కథనంలో ఆరోపిస్తున్న టీం.. వాట్సాప్‌ యూజర్ల ప్రైవసీని పరిరక్షించడమే పనిగా పెట్టుకుందని, యూజర్లు పంపించే రిపోర్ట్‌ అబ్యూజ్‌.. ఇతరత్ర ఫిర్యాదుల్ని సమీక్షించడం కోసమేనని చెప్పింది. ఎన్క్రిప్షన్ కారణంగా.. వాట్సాప్‌ కాల్స్‌, వ్యక్తిగత మెసేజ్‌లను ఫేస్‌బుక్‌ ఎట్టిపరిస్థితుల్లో చదవలేదని స్పష్టం చేసింది ఫేస్‌బుక్‌. అంతేకాదు ఫేస్‌బుక్‌ యూజర్ల విషయంలోనూ తాము భద్రతకు కట్టుబడి ఉన్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

2014లో నాస్‌సెంట్‌ నుంచి వాట్సాప్‌ మెసేజింగ్‌ యాప్‌ను 19 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది ఫేస్‌బుక్‌. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందికి పైగా వాడుతున్న వాట్సాప్‌లో.. మొత్తంగా రోజుకి వెయ్యి కోట్లకి పైగా మెసేజ్‌లు పంపించుకుంటున్నారని అంచనా. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా యూజర్ల మధ్య సురక్షితమైన ఛాటింగ్‌ ఉంటుందని, యూజర్‌ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగబోదని ఫేస్‌బుక్‌-వాట్సాప్‌ ఎప్పటి నుంచో చెప్తోంది.

క్లిక్‌: వాట్స‌ప్‌ యూజర్లకు షాక్

మరిన్ని వార్తలు