Facebook: ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారు

19 Sep, 2021 13:36 IST|Sakshi

ఫేస్‌బుక్‌ పరిశోధకులు ఫేస్‌బుక్‌ ఫ్లాట​ ఫాం నుంచి ఎదురవుతున్న దుష్ప్రభావాలను గుర్తించినప్పటికీ పరిష్కరించడంలో విఫలం

ప్రస్తుతం సోషల్‌ మీడియా నెట్టింట ఎంతలా ప్రభంజనం సృష్టిస్తోందో మనకు తెలియంది కాదు. అలాంటి సోషల్‌ మీడియాపై కొన్ని ఆరోపణలు, విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. వినియోగదారుల సమాచారం లీకవుతోందంటూ రకరకాలు విమర్శలు సర్వత్రా ఎదురైనప్పటికీ వాటిన్నంటిని అధిగమిస్తూ ఫేస్‌బుక్‌ తనదైన శైలిలో దూసుకుపోతుంది. కానీ, ఇప్పటికీ సంస్థపై రూమర్లు, తప్పుడు ప్రచారాలు ఆగడం లేదు. 

సరిగ్గా అలాంటి తప్పుడు ఆరోపణలతో ప్రముఖ ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఫేస్‌బుక్‌ పై కొన్ని కథనాలను ప్రచురించింది. ఫేస్‌బుక్‌ ఉద్యోగులు, యాజమాన్య సిబ్బంది వినయోగదారులకు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడంలో విఫలమైందని, ఒకవేళ గుర్తించినప్పటికీ దాన్ని అధిగమించిలే సరొకొత్త విధానాలు తీసుకురాలేకపోయిందంటూ... ఆరోపిస్తూ కథనాలను ప్రచురించింది. అలాగే ప్రముఖులకు ఫేస్‌బుక్‌ నుంచి మినహాయింపులు, ఇన్‌స్ట్రాగాం యాప్‌ వినియోగించే యువ వినియోగదారులపై  ప్రతికూలభావాలను తగ్గించేలా అల్గారిథమ్‌ మార్పులు చేసిందని విమర్శించింది. అభివృద్ధి చెందిన దేశాలు మానవ అక్రమ రవాణకు ఫేస్‌బుక్‌  ఫ్లాట్‌ ఫాంని ఎలా వినయోగించుకుంటాయంటూ ఫేస్‌బుక్‌ ఉద్యోగులు ఎదురు ప్రశ్నిస్తున్నారంటూ.. రకరకాలుగా కథనాలు ప్రచురించింది.

(చదవండి: ఆ విమానాలను పునరుద్ధరిస్తున్నాం: బైడెన్‌)

ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ గ్లోబల్‌ అఫైర్స్‌ ప్రెసిడెంట్‌ నిక్‌ క్లాగ్‌ మాట్లాడుతూ...."ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించిన కథనాలు ఫేస్‌బుక్‌ లీడర్‌ షిప్‌, ఉద్యోగుల పట్ల తప్పుడు భావం కలిగేలా ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రచురించింది. అంతేకాదు ఉద్దేశపూర్వకంగానే ఈ ఆరోపణలు చేసిందంటూ తీవ్రంగా విరుచుకుపడింది. ఇవన్ని తప్పుడు ఆరోపణలు అంటూ కొట్టిపడేశారు. సంస్థకు ఇబ్బంది కలిగించే వాటిని విస్మరిస్తాం. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించేలా పోస్టులు చేస్తుందన్న విషయాన్ని గుర్తుచేశారు. పరిశోధన విభాగంలో సోషల్‌మీడియా కొత్త ఒరవడులు సృష్టిస్తున్నప్పటికీ అభివృద్ధి చెందుతున్న సమస్యలుగానే మిగిలుతున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.

(చదవండి: గిన్నిస్‌ బుక్‌లోకి వైట్‌ పెయింట్‌.. కరెంట్‌ సేవ్‌తో పాటు ఏసీలను మించే చల్లదనం!!)

మరిన్ని వార్తలు