ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటావర్స్‌పై బాంబ్ పేల్చిన ఫ్రాన్సెస్‌ హౌగెన్‌!

9 Nov, 2021 20:29 IST|Sakshi

ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ విజిల్‌ బ్లోవర్‌గా మారిపోయి..ఫేస్‌బుక్‌ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటావర్స్‌పై ఘాటుగా విమర్శలు చేసింది. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ పేర్కొన్న మెటావర్స్‌ వర్చువల్ రియాలిటీ ప్రపంచం వల్ల ప్రజలు వ్యసనపరులుగా మారే అవకాశం ఉంది అన్నారు. అలాగే, మెటావర్స్‌ ఆన్‌లైన్‌లో గుత్తాధిపత్యాన్ని చెలాయించడంతో పాటు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దోచుకుంటుందని హెచ్చరించింది. 

ది అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. ఫేస్‌బుక్ సంస్థలో హౌగెన్‌ లోపాలను ఎత్తి చూపిన తర్వాత ఆ సంస్థ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు తెలిపింది. అందుకే మాతృసంస్థ పేరును మెటావర్స్‌గా మార్చినట్లు వివరించింది. ఈ మెటావర్స్‌ వర్చువల్ రియాలిటీ ప్రపంచం సహాయంతో ప్రపంచంపై పట్టు సాధించాలని మార్క్‌ జుకర్‌బర్గ్‌ చూస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు విమర్శల నుంచి తప్పించుకోవడానికి మెటావర్స్‌ పేరును పెట్టినట్లు ఆమె తెలిపింది. వర్చువల్ రియాలిటీ, వీడియో గేమ్స్ కోసం పని చేయడానికి 10,000 మంది ఇంజనీర్లను నియమించబోతున్నారు అని తెలిపింది. ఈ వర్చువల్ రియాలిటీ వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని హౌగెన్‌ పేర్కొంది.

(చదవండి: ఇన్‌స్టా యూజర్లకు షాక్‌: ఉచితం లేదు..డబ్బులు చెల్లించాల్సిందే..!)

మరిన్ని వార్తలు