Facebook: ఫేస్‌బుక్‌ను బద్నామ్‌ చేసింది అతడేనా..!

22 Oct, 2021 11:30 IST|Sakshi

Facebook Whistleblower Frances Haugen Funded By Founder Of Ebay: గత కొద్ది రోజుల నుంచి ఫేస్‌బుక్‌పై అనేక ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే. కొంతమంది వ్యక్తుల కోసమే ఫేస్‌బుక్‌  పనిచేస్తుదంటూ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కంపెనీపై దుమ్మెతి పోసింది. కొంత మంది వీఐపీల ప్రైవసీ విషయంలో ఫేస్‌బుక్‌ వారిని అందలాలను ఎక్కిస్తోందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆరోపణలు చేయగా... జర్నల్‌తో పాటుగా ఫేస్‌బుక్‌ విజిల్‌బ్లోయర్‌ ఫ్రాన్సెస్‌ హాగెన్‌ అనే మాజీ ఉద్యోగిని కూడా కంపెనీపై తీవ్ర ఆరోపణలను చేసింది.
చదవండి: Facebook: నువ్వేం తోపు కాదు..! చట్టం ముందు అందరు సమానులే..!


ఫేస్‌బుక్‌ విజిల్‌ బ్లోయర్‌ వెనుక..!
ఫేస్‌బుక్‌ దృష్టిలో యూజర్ల‘భద్రత కంటే లాభాలే ముఖ్యం’ అంటూ యూఎస్‌ కాంగ్రెస్‌ వేదికగా పలు సంచలన రహస్య పత్రాలను ఫేస్‌బుక్‌ విజిల్‌బ్లోయర్‌ తెలిపింది. సంచలన విషయాలను బయటపెట్టిన ప్రాన్సెస్‌ హాగెన్‌ వెనుక ఎదో అదృశ్య శక్తి ఉండే ఉంటుందని పలువురు నిపుణులు భావించారు. ఇప్పుడు అదే నిజమైంది. యూఎస్‌ కాంగ్రెస్‌ ఎదుట ఫేస్‌బుక్‌ పరువు తీసిన ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగి హాగెన్‌ వెనుక ఈబే వ్యవస్థాపకుడు పియరీ ఒమిడ్యార్‌ ఉన్నట్లు ప్రముఖ యూఎస్‌ మీడియా సంస్థ పొలిటికో వెల్లడించింది.

గత ఏడాది  ఈబే సంస్థ సుమారు 150000 లక్షల (సుమారు రూ. 1.12 కోట్లు)డాలర్లను ఫ్రాన్సెస్‌ హాగెన్‌ విరాళంగా ఇచ్చినట్లు పొలిటికో పేర్కొంది. పియరీ ఒమిడ్యార్‌కు చెందిన సంస్థ లూమినేట్ ఫ్రాన్సెస్‌ హాగెన్‌కు యూరప్‌లో కూడా పీఆర్ సేవలను అందించింది. కాగా పొలిటికో వెల్లడించిన పలు అంశాలపై హాగెన్‌, ఒమిడ్యార్‌ ఎలాంటి వ్యాఖ్యలను చేయలేదు.

పియరీ టెక్‌ క్రిటిక్‌..!
పియరీ ఓమిడ్యార్‌ సుప్రసిద్థ టెక్‌ క్రిటిక్‌. పలు దిగ్గజ టెక్‌ కంపెనీలను విమర్శించడంలో పియరీ ఎప్పుడు ముందుంటారు. గతంలో హవాయిలో స్వతంత్ర జర్నలిజం కోసం తన వంతుగా న్యాయవాద ప్రయత్నాలను, కంపెనీల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా అనేక ప్రచారాలు,  పలు కంపెనీల్లోని ఉద్యోగులకు క్రియాశీల మద్దతును పియరీ అందించారు.
చదవండి: ఫేస్‌బుక్‌ పేరు మార్పు..! కొత్త పేరు ఇదేనా...!

మరిన్ని వార్తలు