ఫేస్‌బుక్‌ గ్రూప్‌ పేమెంట్‌ ఫీచర్‌, త్వరలోనే విడుదల..!

5 Dec, 2021 08:25 IST|Sakshi

కోవిడ్‌ కారణంగా ప్రపంచ దేశాల్లో యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ పేమెంట్స్‌ వినియోగం పెరిగిపోతుంది. అయితే దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు ఆయా సంస్థలు యూపీఐ Unified Payments Interface (UPI) పేమెంట్‌ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పే, వాట్సాప్‌లు ఉండగా.. తాజాగా ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌(మెటా)  అధినేత మార్క్‌ జుకర్‌ బర్గ్‌ సైతం ఈ యూపీఐ సర్వీసుల‍్ని ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

ప్రస్తుతం అమెరికాలో బీటా వెర్షన్‌ పై పనిచేస్తున్నట్లు, మరికొద్ది రోజుల్లో పూర్తి స‍్థాయిలో ప్రారంభించనున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. ఆ తరువాత ఇతర దేశాల్లో సైతం ఈ ఫీచర్‌ను వినియోగించేకునే సదుపాయాన్ని కల్పిస్తామని ఫేస్‌బుక్‌ ప్రతినిధులు చెప్పారు.  వచ్చే వారం యూఎస్‌యూలోని మెసేంజర్‌ యూజర్లు వినియోగించేలా పేమెంట్ ఆప్షన్‌పై టెస్ట్‌ చేయనున్నట్లు ఫేస్‌బుక్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది.  

స్ప్లిట్‌ పేమెంట్ పేరుతో మెసెంజర్‌లో ఫేస్‌బుక్‌ పరిచయం చేయనున్న ఈ ఫీచర్‌తో నిత్యవసర సరుకులు, రెంట్, హోటల్‌ బిల్లుల్ని ఒకేసారి సెండ్‌ చేయొచ్చు. అదే సమయంలో నోటిఫికేషన్‌ సైతం పంపిచుకోవచ్చు. చెల్లించిన మొత్తం సంబంధిత వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యిందా లేదా అనేది చెక్‌ చేసుకోవచ్చు. ఆ ట్రాన్సాక్షన్స్‌ అన్నీ మనకు గ్రూప్‌లో ఒక చాట్‌లా కనిపిస్తుంది.  

ఫీచర్ ఎలా పనిచేస్తుంది 

స్ప్లిట్ పేమెంట్స్ ఫీచర్‌ని ఉపయోగించడానికి  గ్రూప్ చాట్‌లో “గెట్ స్టార్ట్” అనే బటన్‌పై క్లిక్‌ చేయాలి. 

క్లిక్‌ చేస్తే పేమెంట్స్‌ ఎవరెవరికి ఎంత పంపించాలో డివైడ్‌ చేయాలి

ఆ వివరాల్ని ఎంటర్‌ చేసిన అనంతరం  మీరు మీ ఫేస్‌బుక్‌  పేమెంట్‌ వివరాల్ని కన్ఫాం చేయాల్సి  ఉంటుంది. 

కన్ఫామ్‌ చేసిన తరువాత.. మీ పంపిన మెసేజ్‌ వెళ్లిందా లేదా చెక్‌ చేయాలి. 

చదవండి: జుకర్‌ బర్గ్‌ను వెంటాడుతున్న యూకే, అమ్ముతావా? లేదా?

మరిన్ని వార్తలు