Fact Check: కన్యా సుమంగళ యోజన, అమ్మాయిలకు నెలకు రూ.4500?

9 May, 2023 13:38 IST|Sakshi

సాక్షి,ముంబై:  కేంద్ర ప్రభుత్వ పథకాలు, లబ్దిదారులకు ప్రయోజనాలు అంటూ పలు పోస్ట్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం కామన్‌గా మారి పోయింది. నిజా నిజాలతో సంబంధం లేకుండా యూజర్లు వీటిని షేర్‌ చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి పోస్ట్‌ ఒకటి హల్‌చల్‌ చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని  ప్రభుత్వం కొత్త పథకం ‘కన్యా సుమంగళ యోజన’ కింద ఆడబిడ్డలున్న కుటుంబాలకు నెలకు రూ.4,500 అందజేస్తుందనే  న్యూస్‌ ఒకటి వైరల్‌గా మారింది. (లగ్జరీ డ్యూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?)

కన్యా సుమంగళ యోజన కింద కుటుంబంలో కుమార్తె ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.4,500 స్టైఫండ్‌ను అందజేస్తోందని సర్కారీ వ్లాగ్ అనే యూట్యూబ్ ఛానెల్‌ వీడియో అప్‌లోడ్ చేసింది. దీనిపై స్పందించిన పీఐబీ ఫాక్ట్ చెక్ టీమ్ అసలు విషయాన్ని ప్రకటించింది. ఇది నకిలీ వార్త అని కొట్టిపారేసింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకం దేన్ని అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీం తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. 

కాగా ప్రధానమంత్రి కన్యా సుమంగళ యోజన అనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. రాష్ట్రంలోని బాలికల విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తుంది.  ఈ పథకం 25 అక్టోబర్ 2019న లక్నోలో ప్రారంభించింది.


 

మరిన్ని వార్తలు