ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై ఐదు సంవత్సరాల వారంటీ...!

30 Sep, 2021 20:53 IST|Sakshi

Fairphone 4 Sustainable Smartphone: మనకు నచ్చిన ఫలానా కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్‌ కొన్నమనుకోండి. దానిపై వారంటీ ఎన్ని రోజులమేర వస్తుందంటే...! సింపుల్‌గా వన్‌ ఇయర్‌ వారంటీ వస్తోందని చెప్తాం. ఫోన్‌తో వచ్చే ఇతర ఎలక్ట్రానిక్స్‌పై ఆర్నెల్లపాటు వారంటీ వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ తయారుచేసే కంపెనీలు గరిష్టంగా ఒక ఏడాది పాటు మాత్రమే వారంటీని అందిస్తాయి. ఈ సమయంలో ఫోన్‌కు ఏమైనా సమస్యలు తలెత్తితే ఆయా కంపెనీలు చూసుకుంటాయి. వారంటీ ముగిసిపోయాక ఏదైనా సమస్య వస్తే కచ్చితంగా డబ్బులను వసూలు చేస్తాయి. కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై  కంపెనీ ఏకంగా ఐదేళ్ల పాటు వారంటీను అందిస్తోంది. 
చదవండి: వరుస సంక్షోభాలు.. చైనాకు భారీ దెబ్బే: గోల్డ్‌మన్‌ సాక్స్‌

మన్నికైన, పర్యావరణహితంగా ఉండే స్మార్ట్‌ఫోన్లను ప్రముఖ డచ్‌ కంపెనీ ఫెయిర్‌ఫోన్‌ తయారుచేస్తోంది.  భూమ్మీద ఎలక్ట్రానిక్స్‌ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఫెయిర్‌ఫోన్‌ పనిచేస్తోంది. తాజాగా  ఫెయిర్‌ఫోన్‌ 4 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై ఐదేళ్ల పాటు వారంటీని అందిస్తుంది.

భవిష్యత్తులో వచ్చే ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ 12, 13, 14, 15 వెర్షన్లను సపోర్ట్‌ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ ర్యామ్‌+128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌+256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌తో లభిస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ గ్రీన్‌, గ్రే, స్పెక్‌ల్డ్‌ గ్రీన్‌ కలర్‌ ఆప్షన్లతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చును. అక్టోబర్‌ 25 నుంచి కంపెనీ పలు దేశాలకు డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. 6జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 49,800 కాగా 8జీబీ వేరియంట్‌ ధర రూ. 55, 845.

ఫెయిర్‌ఫోన్‌ 4 ఫీచర్లు..

 •  6.3-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,340 పిక్సెల్స్) ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే
 • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 
 • స్నాప్‌డ్రాగన్ 750జీ 
 • ఆడ్రెనో 619 జీపీయూ
 • 8జీబీ ర్యామ్‌+ 256 ఇంటర్నల్‌ స్టోరేజ్‌+ 2టీబీ మైక్రో ఎస్‌డీ సపోర్ట్‌
 • ఆండ్రాయిడ్‌ 11 సపోర్ట్‌
 • 48 ఎమ్‌పీ రియర్‌ కెమెరా
 • 25ఎమ్‌పీ సెల్ఫీ కెమెరా
 • 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ 3,905mAh రిమూవబుల్ బ్యాటరీ
 • డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై
 • 5జీ సపోర్ట్‌,  యూఎస్‌బీ టైప్‌సీ

చదవండి: రోల్స్‌రాయిస్‌ నుంచి తొలి ఎలక్ట్రిక్‌ కార్‌పై ఓ లుక్కేయండి..!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు