గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఫేక్‌ ‘చాట్‌జీపీటీ’ యాప్స్‌ కలకలం

13 Jan, 2023 10:51 IST|Sakshi

చాట్‌జీపీటీ పరిచయం అక్కర్లేని పేరు. కాలంతో పాటు ఉరుకులు పరుగుల జీవితాన్ని టెక్నాలజీ పరంగా మరింత సులభతరం చేసేందుకు వెలుగులోకి వచ్చిందే ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో ఆధారిత చాట్‌బోట్ ‘చాట్‌జీపీటీ’. గూగుల్‌లో మనకు కావాల్సిన సమాచారాన్ని ఎలా సేకరిస్తామో.. లేటెస్ట్‌ టెక్నాలజీ చాట్‌జీపీటీలో సైతం అలాగే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ పొందవచ్చు. ప్రస్తుతం చాట్‌జీపీటీ పేరెంట్ సంస్థ  ఓపెన్ ఏఐ సర్వీసుల్ని యూజర్లనకు ఉచితంగా అందిస్తుంది.  

దీన్ని అదునుగా భావించిన సైబర్‌ నేరస్తులు చాట్‌ జీపీటీ ఫేక్‌ యాప్స్‌ను క్రియేట్‌ చేశారు. వాటి సాయంతో యూజర్ల సొమ్మును కాజేసేందుకు యాపిల్ యాప్ స్టోర్‌, గూగుల్ ప్లే స్టోర్‌ల్లో కూడా పెట్టేశారు. అదనపు ఫీచర్లు పేరుతో యూజర్ల నుంచి పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవడంతో పాటు పాజిటీవ్‌ రివ్యూలు సైతం వెలుగులోకి వచ్చాయి.

అయితే ఈ ఫేక్ యాప్స్‌పై కన్నేసిన యాపిల్‌, గూగుల్‌ సంస్థలు ప్లే స్టోర్‌ల నుంచి యాప్స్‌ను తొలగించాయి. అంతేకాదు చాట్‌జీపీటీ సేవలు ప్రస్తుతం అందుబాటులో లేవని యూజర్లకు హెచ్చరికలు జారీ చేశాయి. పొరపాటు చాట్‌జీపీటీ పేరుతో యాప్స్‌ కనిపిస్తే వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని, అలాంటి యాప్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.

మరిన్ని వార్తలు