Squid Game: స్క్విడ్‌ గేమ్‌ పేరుతో యాప్స్‌.. దాడికి దిగిన జోకర్‌ మాల్వేర్‌

21 Oct, 2021 14:59 IST|Sakshi

‘స్క్విడ్‌ గేమ్‌’.90 దేశాల వీక్షకుల్ని ఊపేస్తున్న కొరియన్‌ వెబ్‌ సిరీస్‌. అయితే ఈ వెబ్‌ సిరీస్‌కు ఊహించని రెస్పాన్స్‌ను క్యాష్‌ చేసుకునేందుకు హ్యాకర్స్‌ మాల్వేర్తో దాడులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన గూగుల్‌ 'ప్లే స్టోర్‌'లో స్క్విడ్‌ గేమ్‌ పేరుతో ఉన్న యాప్స్‌ను డిలీట్‌ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. మాల్వేర్‌ ఉన్న ఆ యాప్స్‌ 5వేల డౌన్ లోడ్లు దాటిన్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు యూజర్లను టార్గెట్‌ చేసేందుకు జోకర్‌ రంగంలోకి దిగినట్లు మాల్వేర్‌ రీసెర్చర్లు గుర్తించారు.    

12ఏళ్ల కష్టం
దక్షిణ కొరియా దర్శకుడు హ్వాంగ్‌ డాంగ్‌ హ్యుక్  12 ఏళ్ల క్రితం అంటే 2009 లో స్క్విడ్‌గేమ్‌ పేరుతో స్టోరీ రాసుకున్నారు. కాలం కలిసిరాక, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా తెరక్కెక్కేందుకు ఇన్నేళ్లు పట్టింది. అయినా ఈ ఏడాది సెప్టెంబర్‌ 17న నెట్‌ ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌కు ఊహించని విధంగా వీక్షకులు బ్రహ్మరథం పడుతుంటే డైరెక్టర్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 21.4 మిలియన్ల బడ్జెట్ తో ఈ సిరీస్‌ను తెరకెక్కించగా 900 మిలియన్ల లాభాల్ని గడించింది. నెట్‌ ఫ్లిక్స్‌ ఇప్పటి వరకు వరల్డ్‌ వైడ్‌ గా ఈ సిరీస్‌ను 142మిలియన్ల మంది యూజర్లు వీక్షించారు. 

అయితే దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు ట్విట్టర్‌ యూజర్‌ @ReBensk పేరుతో స్క్విడ్‌ గేమ్‌ వాల్‌ పేపర్లుతో ఓ యాప్‌ను డిజైన్‌ చేశారు. ఆ యాప్‌లో మాల్వేర్‌ ఉందనే విషయాన్ని తొలిసారి గుర్తించారంటూ ఫోర్బ్స్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ స్క్విడ్‌ గేమ్‌ వాల్‌ పేపర్‌ యాప్‌తో ప్రమాదకరమైన యాడ్స్‌ తో పాటు ఎస్‌ఎంఎస్‌లతో పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ చేయాలని డిమాండ్‌ చేసినట్లు ఈఎస్‌ఈటీ మాల్వేర్‌ రీసెర్చర్‌ లుకాస్ స్టెఫాంకో గుర్తించారు. అంతేకాదు ఈ యాప్స్‌లలో జోకర్‌ మాల్వేర్‌ ఇన్‌ స్టాల్‌ చేసినట్లు లుకాస్‌ తెలిపారు. 

జోకర్‌ మాల్వేర్‌ 
జోకర్‌ మాల్వేర్‌..! ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు పరిచయం అక్కర్లేని పేరు. మొదటిసారి 2017లో గూగుల్‌లో ప్లేస్టోర్‌లలో యాప్స్‌పై దాడి చేసింది. దీంతో దీన్ని గుర్తించేందుకు గూగుల్‌కే మూడేళ్లు పట్టింది. గుర్తించిన తరువాత సుమారు జోకర్‌ మాల్వేర్‌ నిండిన 1800 యాప్స్‌ను గూగుల్‌ డిలీట్‌ చేసింది. తాజాగా స్క్విడ్‌ గేమ్‌ పేరుతో ప్లేస్టోర్‌లో ఉన్న యాప్స్‌లలో ఈ జోకర్‌ మాల్వేర్‌ ఉన్నట్లు  ఈఎస్‌ఈటీ మాల్వేర్‌ రీసెర్చర్‌ లుకాస్ స్టెఫాంకో హెచ్చరించారు.

చదవండి: అక్కడేమో ప్రాణాలతో చెలగాటం! ఇక్కడేమో..

మరిన్ని వార్తలు