నైకా ఫల్గుణి సంచలనం: తగ్గేదేలే అంటున్న బిజినెస్‌ విమెన్‌

29 Nov, 2022 17:38 IST|Sakshi

సాక్షి, ముంబై: ఫోర్బ్స్ 2022 భారతదేశపు 100 మంది సంపన్నుల జాబితాలో ఈ ఏడాది అనేక మంది కొత్త బిలియనీర్లు చోటు సంపాదించడం విశేషం. రూపాయి విలువ  క్షీణత,  ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆందోళనలున్నప్పటికీ దేశం లోని  టాప్-100 కుబేరుల సంపద అసాధారణంగా పెరిగిందని ఫోర్బ్స్ డేటా  ద్వారా తెలుస్తోంది.

ఫల్గుణి నాయర్: ముఖ్యంగా ఇటీవల ఐపీవోతోపాటు పలు సంచనాలకు మారు పేరు  నైకా ఫౌండర్‌ ఫల్గుణి నాయర్  టాప్‌-50లో చోటు సంపాదించు కున్నారు.  రూ. 32,951.71 కోట్లతో  దేశంలోని అత్యంత ధనవంతుల స్వీయ-నిర్మిత బిలియనీర్‌గా ప్రశంస లందుకున్నారు. ఫోర్బ్స్ డేటా ప్రకారం 4.8 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఫల్గుణి నాయర్ జాబితాలో 44వ స్థానంలో నిలిచారు. ఐఐఎం అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్  నాయర్‌  2012లో "మల్టీ-బ్రాండ్ ఓమ్నిచానెల్ బ్యూటీ-ఫోకస్డ్ రిటైల్ వ్యాపారాన్ని నిర్మించాలనే లక్క్ష్యంతో నైకాను  స్థాపించారు. 

సావిత్రి జిందాల్: ఫోర్బ్స్ ప్రకారం ఓపీ జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్, సావిత్రి జిందాల్ టాప్-10లో ఉన్న ఏకైక మహిళా బిలియనీర్. 17.4 బిలియన్‌ డాలర్ల నికర విలువతో 72 ఏళ్ల సావిత్రి జిందాల్ ఈ సంవత్సరం జాబితాలో మొదటి పది మంది ధనవంతుల జాబితాలో ఉన్నారు.  ఆమె భర్త ఓం ప్రకాష్ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత, గ్రూప్ బాధ్యతలను చేపట్టారు. ఈ దంపతుల నలుగురు కుమారుల స్వతంత్రంగా కంపెనీలను నిర్వహిస్తున్నారు. 

రేఖా ఝున్‌ఝున్‌వాలా: దివంగత పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్‌ఝున్‌వాలా భార్య రేఖాఈ లిస్ట్‌లో 30వ స్థానంలో నిలిచి తన భర్తన స్థానాన్ని భర్తీ చేశారు. ఆమె నికర సంపద 5.9 బిలియన్‌ డాలర్లు. (ఫోర్బ్స్‌ టాప్‌ -10 లిస్ట్‌: బిలియనీర్లు అదానీ, అంబానీ ఎక్కడ?)

నెహాల్‌ వకీల్‌: ఏసియన్‌ పెయింట్స్‌కు చెందిన నెహాల్‌ వకీల్‌  0.52  బిలియన్‌ డాలర్లతో 46వ స్థానంలో నిలిచారు. తొలిసారి 2022 ఫోర్బ్స్ జాబితాలో ఎంట్రీ ఇచ్చారు. 1942లో స్థాపించిన ఏషియన్ పెయింట్స్  కంపెనీని  నడుపుతున్న కుటుంబంలోని థర్డ్‌ జెనరేషన్‌ ప్రతినిధి నెహాల్‌.  అంతేకాదు బోర్డులో ఉన్న  ముఖ్య కుటుంబ సభ్యులలో నేహా ఒకరు.

కిరణ్ మజుందార్-షా: బయోకాన్‌ ఎండీ కిరణ్‌ మజుందార్-షా 2.7 బిలియన్‌  డాలర్ల నికర సంపదతో భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో 76వ స్థానంలో నిలిచారు. 1978లో ఆదాయం ద్వారా భారతదేశంలో అతిపెద్ద లిస్టెడ్ బయోఫార్మాస్యూటికల్ సంస్థగా  బయోకాన్‌ అవతరించింది. 

లీనా తివారీ: 3.7 బిలియన్‌ డాలర్ల నికర విలువతో, లీనా తివారీ ఈ సంవత్సరం అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో 51వ ప్లేస్‌లో నిలిచారు.  ఫార్మాస్యూటికల్ దిగ్గజం  యూఎస్‌వీ  ఇండియా ఛైర్‌పర్సన్‌గా, తివారీ 2018లో జర్మన్ జెనరిక్స్ సంస్థ జూటా ఫార్మాను కొనుగోలు చేశారు.

అను అగా: 80 ఏళ్ల అను అగా తిరిగి మళ్లీ రిచెస్ట్‌  ఇండియన్స్‌ జాబితాలో చోటు సంపాదించారు. 1.9 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో 88వ స్థానంలో నిలిచారు. థర్మాక్స్ అనే లిస్టెడ్ ఇంజనీరింగ్ సంస్థలో అగా మెజారిటీ వాటాను కలిగి ఉంది. అగా 1985లో తన జీవిత భాగస్వామి కంపెనీలో పని చేయడం ప్రారంభించారు.  సుదీర్ఘం అనారోగ్యంతో భర్త మరణించడంతో 1996లో ఆమె కంపెనీ బాధ్యతలు చేపట్టారు. తరువాత కెమికల్ ఇంజనీర్ అయి అను కుమార్తె మెహెర్ బాధ్యతలు చేపట్టడంతో 2004లో అగా  ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసి సామాజిక కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. 

అలాగే ఇండియన్ ఎత్నిక్ వేర్ తయారీదారు, మన్యవార్ బ్రాండ్‌కు ప్రసిద్ధి చెందిన  వేదాంత్ ఫ్యాషన్స్ ఓనర్‌ రవి మోడీ 3.6 బిలియన్‌ డాలర్లతో ఫోర్బ్స్ లో చోటు సాధించారు. ఇంకా యూఎన్‌వో మిండా (గతంలో మిండా ఇండస్ట్రీస్)  సీఎండీ  నిర్మల్ మిండా మెట్రో బ్రాండ్‌లకు చెందిన రఫీక్ మాలిక్ జాబితాలో కొత్తగా ప్రవేశించిన వారిలో ఉన్నారు.
 

మరిన్ని వార్తలు