11,300 దిగువకు నిఫ్టీ

10 Sep, 2020 06:47 IST|Sakshi

బలహీనంగా ఆసియా మార్కెట్లు 

ఆస్ట్రాజెనెకా ‘వ్యాక్సిన్‌’కు బ్రేక్‌

రిలయన్స్‌ జోరుతో తగ్గిన నష్టాలు  

171 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్‌  

39 పాయింట్లు పడి 11,278కు నిఫ్టీ

ఆసియా మార్కెట్ల బలహీనతలతో మన మార్కెట్‌ కూడా బుధవారం నష్టపోయింది. ఆ్రస్టాజెనెకా ఫార్మా కంపెనీ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ను ఆపేయడం ప్రతికూల ప్రభావం చూపించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జోరుగా పెరిగినా, సూచీలను నష్టాల నుంచి గట్టెక్కించలేకపోయింది. కానీ ఈ షేర్‌ పెరగడం, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో మొదలవడం వల్ల సెన్సెక్స్, నిఫ్టీల ఇంట్రాడే  నష్టాలు తగ్గాయి. ఇంట్రాడేలో 430 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ చివరకు 171 పాయింట్ల నష్టంతో 38,194  పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 39 పాయింట్లు క్షీణించి 11,278 పాయింట్లకు చేరింది. వరుసగా రెండో రోజూ స్టాక్‌ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు పుంజుకొని 73.55 వద్దకు చేరింది. బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.  చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులంటున్నారు. టెక్నాలజీ షేర్ల పతనం కొనసాగడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ సూచీలు భారీగా నష్టపోయయి. ఈ  ప్రభావంతో బుధవారం ఆసియా మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. 

రిలయన్స్‌ ఇండస్ట్రీ రిటైల్‌ విభాగం, రిలయన్స్‌ రిటైల్‌లో 1.75 శాతం వాటా కోసం అమెరికా ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం సిల్వర్‌ లేక్‌ రూ.7,500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  షేర్‌ శాతం 2.5 లాభంతో రూ.2,161  వద్ద ముగిసింది.  
ఎస్‌బీఐ 4 శాతం నష్టంతో రూ.194 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
ఆ్రస్టాజెనెకా ఫార్మా షేర్‌ 3 శాతం నష్టంతో రూ.4,074 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 13 శాతం పతనమైంది. ఈ కంపెనీ మాతృసంస్థ కరోనా వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఆపేయడమే ఈ నష్టాలకు కారణం. 
100కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. టాటా ఎలెక్సీ, అదానీ గ్రీన్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ ఐపీఓ... అదుర్స్‌: 51 రెట్లు ఓవర్‌ సబ్‌స్రై్కబ్‌
హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు అదిరిపోయే స్పందన లభించింది. బుధవారం ముగిసిన ఈ ఐపీఓ 151 రెట్లు ఓవర్‌ సబ్‌స్రై్కబయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.702 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా మొత్తం 2.32 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుండగా, మొత్తం 300 కోట్లకు పైగా షేర్లకు దరఖాస్తులు వచ్చాయి.  సోమవారం ఆరంభమైన ఈ ఐపీఓ ప్రైస్‌బ్యాండ్‌ రూ.165–166గా ఉంది. ఈ కంపెనీ షేర్లు  ఈ నెల 17న స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి.  గ్రే మార్కెట్‌ ప్రీమియమ్‌ (జీఎమ్‌పీ) రూ. 100కు పైగా ఉండటంతో ఈ షేర్‌ రూ. 300 రేంజ్‌లో లిస్ట్‌ కావచ్చని అంచనా.  

మరిన్ని వార్తలు