YouTube: అతనికి జాబ్ లేదు! కోట్లు సంపాదిస్తున్నాడిలా..

31 Mar, 2023 16:06 IST|Sakshi

సోషల్ మీడియా ఈ రోజు ప్రపంచాన్ని ఏలేస్తోంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటితో ఎంతోమంది పాపులర్ అవుతున్నారు. ఆలాంటి వారిలో ఒకరు అమెరికాకు చెందిన 'జిమ్మీ డొనాల్డ్‌సన్'. ఇతడు యూట్యూబ్ ద్వారా ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నాడు. 

మిస్టర్ బీస్ట్‌గా ప్రసిద్ధి చెందిన 'జిమ్మీ డొనాల్డ్‌సన్' యూట్యూబ్ ద్వారా సక్సెస్ సాధించిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి. ప్రస్తుతం తన ఛానెల్‌కి 139 మిలియన్ల కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్‌ కలిగి ఉన్నారు. ఎంతో ఆసక్తికరమైన కంటెంట్స్ సృష్టించడంలో ఆరితేరిన మిస్టర్ బీస్ట్‌ అద్భుతమైన విన్యాసాలు, ఛాలెంజ్‌లు, విరాళాలను అందించడం ద్వారా బాగా పేమస్ అయ్యాడు.

ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న యువకులలో డొనాల్డ్‌సన్ కూడా ఒకరు కావడం గమనార్హం. 2021లో అతడు ఏకంగా 54 మిలియన్ డాలర్లను సంపాదించినట్లు తెలిసింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 400 కోట్ల కంటే ఎక్కువ.

(ఇదీ చదవండి: New Mahindra Thar: థార్ కొత్త వేరియంట్​.. మారుతి జిమ్నీకి గట్టి షాక్!)

1998 మే 1న నార్త్ కరోలినాలోని గ్రీన్‌విల్లేలో జన్మించిన జిమ్మీ డొనాల్డ్‌సన్ 2012లో మిస్టర్ బీస్ట్ అనే పేరుతో యూట్యూబ్‌ ఛానల్ ప్రారంభించాడు. గేమింగ్, కామెంటరీ వంటి వాటితో మొదలై అతి తక్కువ కాలంలోనే యువతను ఎంతగానో ఆకట్టుకునే స్టంట్స్ మొదలైనవి ప్రారభించి ఎక్కువమందిని ఆకర్శించాడు.

మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ చాలా వేగంగా లెక్కకు మించిన సబ్‌స్క్రైబర్స్ పొందగలిగింది. అయితే ఇతని ఛానెల్ కోసం కొన్ని సంస్థలు బిలియన్ డాలర్లను ఆఫర్ చేసినప్పటికీ వాటన్నింటిని తిరస్కరించినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటికి కూడా అతడు సొంతంగానే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు.

(ఇదీ చదవండి: మారుతి జిమ్నీ డెలివరీలు అప్పుడే!)

బిలియన్ డాలర్ ఆఫర్‌ను తిరస్కరించినప్పటికీ మిస్టర్ బెస్ట్ అత్యంత విజయవంతమైన కంటెంట్ సృష్టికర్తలలో ఒకరుగా కొనసాగుతున్నాడు. కొన్ని నివేదికల ప్రకారం 2020లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సంపాదిస్తున్న యూట్యూబర్స్ జాబితాలో డొనాల్డ్‌సన్ 40వ స్థానం పొందాడు.

మరిన్ని వార్తలు