బిలినీయర్‌గా మారిన రైతు కొడుకు.. రవి పిళ్ళై సక్సెస్ స్టోరీ!

20 Mar, 2023 09:23 IST|Sakshi

'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు' అనే మాటలకు నిలువెత్తు నిదర్శనం 'రవి పిళ్లై'. పేదరికంతో పోరాడుతున్న రైతు కుటుంబంలో జన్మించిన ఈయన ఈ రోజు కేరళలో మాత్రమే కాకుండా మిడిల్ ఈస్ట్‌లోని అత్యంత సంపన్నులైన భారతీయులలో ఒకరుగా ఉన్నారు.

కేరళ కొల్లాం తీరప్రాంత పట్టణానికి చెందిన ఒక గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రవి పిళ్ళై కష్టాలు ఎన్ని ఎదురైనా చదువు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. తరువాత చిట్-ఫండ్ కంపెనీతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే నష్టాలపాలయ్యాడు.

ఆ తరువాత 150 మందితో కన్‌స్ట్రక్షన్ (construction) కంపెనీ ప్రారంభించాడు, క్రమంగా తన ఎదుగుదల ప్రారంభమైంది. ఈ రోజు ఇందులో ఏకంగా 70,000 కంటే ఎక్కువమంది పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు ది రావిజ్ అష్టముడి, ది రవిజ్ కోవలం మరియు ది రవిజ్ కడవు వంటి 5 స్టార్ హోటళ్లను నడుపుతున్నాడు.

(ఇదీ చదవండి: Keerthy Suresh: వామ్మో.. మహానటి ఆస్తులు అన్ని కోట్లా?)

పిళ్లై ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అనేక గృహాలు కూడా ఉన్నట్లు సమాచారం, ఇందులో ఒకటి పూణేలోని ట్రంప్ టవర్ లగ్జరీ కాండో. కొల్లాంలో RP మాల్, 300 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని కలిగి ఉన్నాడు. నిరంతర కృషి, పట్టుదలతో సక్సెస్ సాధించిన రవి పిళ్ళైకి భారత ప్రభుత్వం 2008లో ప్రవాసీ భారతీయ సమ్మాన్, 2010లో పద్మశ్రీ అవార్డులు అందించింది. అంతే కాకుండా న్యూయార్క్ ఎక్సెల్సియర్ కాలేజీ నుంచి డాక్టరల్ డిగ్రీ కూడా అందుకున్నారు.

పేదరికంతో పోరాడుతున్న రైతు కొడుకుగా జన్మించిన రవి పిళ్లై RP గ్రూప్ సామ్రాజ్యాన్ని నిలబెట్టి, ప్రస్తుతం 7.8 బిలియన్ డాలర్లు సంపాదించారు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 64,000 కోట్లు కంటే ఎక్కువ. లగ్జరీ హోటల్స్ మాత్రమే కాకుండా స్టీల్, గ్యాస్, ఆయిల్, సిమెంట్, షాపింగ్ మాల్స్ వంటి వ్యాపారాల్లో కూడా తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నారు.

(ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా 'ఆఫ్‌లైన్ ట్రాన్సక్షన్‌'.. మీకు తెలుసా?)

దాదాపు 100 కోట్లు ఖరీదైన ఎయిర్‌బస్ హెచ్145 హెలికాప్టర్‌ను చేసుకున్న మొదటి భారతీయుడిగా పిళ్లై కావడం గమనార్హం. ఈయన వద్ద ఆధునిక లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇందులో రోల్స్ రాయిస్ గోస్ట్, మెర్సిడెస్ మేబాచ్ ఎస్ 600, బిఎండబ్ల్యు 520 డి, ఆడి ఎ 6 మ్యాట్రిక్స్, మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 500, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఉన్నాయి.

మరిన్ని వార్తలు