అదిరిపోయే స్కీమ్.. రైతులకు నెలనెలా రూ. 3 వేల పెన్షన్!

18 Mar, 2023 18:46 IST|Sakshi

రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల్ని ప్రవేశపెట్టింది. 60 ఏళ్లు నిండిన రైతులకు నెలకు కనీసం రూ.3 వేల చొప్పున పెన్షన్‌ అందించేందుకు ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన (PM Kisan Mandhan Yojana) పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే రైతుల రుణాల కోసం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, పెట్టుబడి సాయం కోసం పీఎం కిసాన్‌  సమ్మాన్‌ నిధి పథకాన్ని అమలు చేస్తుండగా ..పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి రైతులకు ఆర్థికంగా తోడుగా నిలుస్తుంది.

ఇక పెన్షన్‌ స్కీమ్‌లో రైతులు లబ్ధి పొందాలంటే కొన్ని అర్హతలు తప్పని సరిగా ఉండాలి. వాటిలో ముందుగా రైతులు భూ సంబంధిత రికార్డుల్లో వారి పేర్లు ఉండాలి. 2 హెక్టార్ల వరకు సాగు భూమి, వయస్సు 18 నుంచి 40 మధ్య వారై ఉండాలి. అర్హులైన రైతు తనకు 60 ఏళ్లు వచ్చేంత వరకు నెలకు రూ.55 నుంచి రూ.220 వరకు చెల్లించాలి. వయసు 60 దాటాక ఈ పథకం కింద నెలకు కనీస పెన్షన్‌ రూ.3 వేలు పొందవచ్చు. ఒక వేళ లబ్ధి దారుడు మరణిస్తే అతని జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్‌ వస్తుంది. అతడి పిల్లలకు వర్తించదు.

ఈ పథకంలో చేరాలంటే..
ఈ పథకంలో చేరాలంటే దరఖాస్తుదారుడి ప్రభుత్వ గుర్తింపు కార్డులు, జీవిత భాగస్వామి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన అర్హత గల రైతులు తమ ప్రాంతంలో ఉన్న కామన్‌ సర్వీస్‌ సెంటర్‌, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

చదవండి👉 లవ్‌ బ్రేకప్‌కి ఓ ఇన్సూరెన్స్‌ ఉందని మీకు తెలుసా?

మరిన్ని వార్తలు