ఫాస్టాగ్‌తో టోల్‌ కలెక్షన్‌ అదుర్స్‌ 

25 Jan, 2023 08:25 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదార్లలో ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ వసూళ్లు గతేడాది రూ.50,855 కోట్లు నమోదయ్యాయి. 2021తో పోలిస్తే ఇది ఏకంగా 46 శాతం అధికం కావడం విశేషం.

నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రకారం డిసెంబర్‌లో ఫాస్టాగ్‌ ద్వారా సగటున రోజుకు రూ.134.44 కోట్ల టోల్‌ ఫీజు వసూలైంది. గత నెల 24న గరిష్టంగా రూ.144.19 కోట్లు నమోదైంది.

2022లో ఫాస్టాగ్‌ లావాదేవీలు 48 శాతం అధికమై 324 కోట్లకు చేరుకున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 6.4 కోట్ల ఫాస్టాగ్స్‌ జారీ అయ్యాయి. ఫాస్టాగ్‌ ఆధారంగా ఫీజును స్వీకరించే టోల్‌ ప్లాజాల సంఖ్య 922 నుంచి గతేడాది 1,181కి చేరింది.  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు