నాలుగు మిలియన్లతో సత్తా చాటిన ఫౌజీ

21 Jan, 2021 12:28 IST|Sakshi

న్యూఢిల్లీ: గేమింగ్ ప్రియులకు గుడ్‌న్యూస్‌. పబ్‌జీకి దీటుగా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఫౌజీ(ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌ గార్డ్స్‌)గేమ్ గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న‌ విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే నాలుగు మిలియన్ ప్రీ-రిజిస్ట్రేషన్లతో తన సత్తా చాటినట్లు ఎన్‌కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ పేర్కొన్నారు. ఈ గేమ్ మిడ్-రేంజ్, హై-ఎండ్ ఫోన్‌లకు మాత్రమే పరిమితం అయినప్పటికీ ఫౌజీ ఇంత తక్కువ సమయంలో ఈ  మైలురాయిని చేరుకోవడం విశేషం. ప్రసుతం బడ్జెట్ ఫోన్‌లకు సపోర్ట్ చేయనప్పటికీ.. త్వరలో తక్కువ-స్థాయి ఫోన్‌ల కోసం ఈ గేమ్ లైట్ వెర్షన్‌ను విడుదల చేస్తామని ఎన్‌కోర్ గేమ్స్ ప్రకటించింది.(చదవండి: వన్‌ప్లస్ యూజర్లకు గుడ్‌న్యూస్‌)

భారతదేశంలో 2020 డిసెంబరు నెలలో ఫౌజీ గేమ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభించగా 24 గంటల్లో ఒక మిలియన్‌ రిజిస్ట్రేషన్లతో రికార్డు సృష్టించింది. ఫౌజీ గేమ్ ని బెంగళూరుకి చెందిన స్టూడియో ఎన్‌కోర్ గేమ్స్‌ అనే సంస్థ రూపొందించింది. ఈ గేమ్ మొదట్లో భారత ప్రభుత్వం నిషేధించిన పబ్‌జీ మొబైల్‌కు ప్రత్యామ్నాయంగా వస్తుందని అందరు భావించారు. కానీ, ఇది పబ్‌జీకి ప్రత్యామ్నాయం కాదని విశాల్ గొండాల్ గతంలో పేర్కొన్నారు. ప్రస్తుతం పబ్‌జీ మొబైల్ ఇండియా విడుదల అయ్యేటట్లు కనబడటం లేదు. ఫౌజీ ఇండియా కొద్దీ రోజుల్లోనే లాంచ్ కానుంది. మల్టీప్లేయర్ బాటిల్ రాయల్ గేమ్ కోసం దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇక ప్రతిరోజూ పండగే. జాతీయ భద్రతా ఆందోళనల నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ నెలలో భారత ప్రభుత్వం పబ్‌జీని నిషేదించిన సంగతి మనకు తెలిసిందే.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు