రికార్డులు సృష్టిస్తున్న భారత పబ్జీ ‘ఫౌజీ’

29 Jan, 2021 12:21 IST|Sakshi

చైనా యాప్‌ అని 'పబ్‌జీ’ని నిషేధించడంతో దానికి పోటీగా ‘ఫౌజీ’ (ఫియ‌ర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్‌) తీసుకొచ్చారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ గేమ్‌ రికార్డ్‌ సృష్టించింది. మల్టీప్లేయిర్ ప్లేయర్ యాక్షన్ గేమ్‌గా భారత సైనికుల వీరోచిత పోరాటాలు ప్రతిబింబించేలా బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్ గేమ్స్‌ ‘ఫౌజీ’ రూపొందించారు. భారత పబ్జీగా పిలువబడే ఫౌజీ బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నేతృత్వంలో రూపొందింది. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26వ తేదీన అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజు 24 గంట‌ల్లో 3 ల‌క్ష‌ల డౌన్‌లోడ్లు సాధించగా.. మూడు రోజుల్లోనే ఫౌజీ గేమ్ 50 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.
(చదవండి: రివ్యూ: ఫౌజీ గేమ్ ఎలా ఉందంటే?)

గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యంత ఎక్కువ మంది డౌన్‌లోడ్‌ చేసుకున్న గేమ్‌గా ఫౌజీ నిలవనుంది. అందరికంటే ముందుగా ఫ్రీ-రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారుల మొబైల్ లలో ఆటోమేటిక్ గేమ్ డౌన్‌లోడ్ అయ్యింది. ఈ గేమ్‌ను సుమారు 500ఎంబీ సైజ్‌లో తీసుకొచ్చారు. ఫౌజీ గేమ్‌ని ఓపెన్ చేశాక మొదటి దశలో మూడు రకాల మోడ్స్‌ (క్యాంపెయిన్‌, టీమ్‌ డెత్‌ మ్యాచ్‌, ఫ్రీ ఫర్‌ ఆల్‌) కనిపిస్తాయి. ప్రస్తుతం క్యాంపెయిన్ మోడ్ మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత దశలో అప్‌డేట్స్‌ రూపంలో మిగిలిన మోడ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు గ్రాఫిక్ సెట్టింగ్స్ మీడియంలో ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి అల్ట్రా వరకు పెంచుకోవచ్చు.
(చదవండి: మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా? )

ప్రస్తుతం పబ్జీ గేమ్‌లో మాదిరి మల్టీ ప్లేయర్‌కి సపోర్ట్ చేయకపోయినా తర్వాత దశలో మల్టీ ప్లేయర్ సపోర్ట్ తీసుకురానున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఇది ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ)తో ఆధారంగా పనిచేస్తుంది. భారత్‌, చైనా మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణ‌మైన గల్వాన్ లోయ థీమ్‌తో ఈ గేమ్ రూపొందింది. ఈ గేమ్‌ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం భార‌త్ కే వీర్ ట్ర‌స్ట్‌కు వెళ్తుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు