డేంజర్‌లో ఫేస్‌బుక్‌ ఖాతాలు: డక్‌టైల్ మాల్వేర్‌ కొత్త వెర్షన్‌

15 Oct, 2022 15:39 IST|Sakshi

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌  ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌. ఫేస్‌బుక్‌ బిజినెస్‌ ఖాతాలు కొత్త మాలావేర్‌ దాడికి గురయ్యాయి. డక్‌టైల్ మాల్వేర్ కొత్త పీహెచ్‌పీ వెర్షన్‌తో వినియోగదారులనుప్రమాదంలో నెట్టేసింది. పలు బిజినెస్‌ ఖాతాలు హ్యాకింగ్‌గు గురైనట్టు తెలుస్తోంది. దీనిపై క్లౌడ్‌  సెక్యూరిటీ క ంపెనీ తాజా హెచ్చరికలు జారీచేసింది. 

క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ, ZScaler అక్టోబర్ 13న తన బ్లాగ్ పోస్ట్‌లో ఈ కొత్త వాలావేర్‌ గురించి నివేదించింది. ఫ్రీ, క్రాక్‌డ్‌ అప్లికేషన్ ఇన్‌స్టాలర్‌గా ఆయా ఖాతాల్లోకి జొర పడుతోందని తెలిపింది. ఈ కొత్త పీహెచ్‌పీ డక్‌టైల్ మాల్వేర్, యూజర్ల  ఇమెయిల్ అడ్రస్‌లు, పేమెంట్ రికార్డ్‌లు, ఫండింగ్ సోర్స్‌లు అకౌంట్ స్టేటస్‌లలో చెల్లింపు సమాచారం కూడా దృష్టి సారించింది. అంతేకాదు ఇది పేజీలను  మార్చగలదు.. కీలక ఆర్థిక సమాచారాన్ని యాక్సెస్ చేయగలదని, ఫేస్‌బుక్‌తో పాటు టెలిగ్రామ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్స్‌ సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లను కూడా లక్ష్యంగా చేసుకుందని కంపెనీ వెల్లడించింది. 

గతంలో ఉపయోగించిన డక్‌టైల్ డాట్‌నెట్ బైనరీకి  బదులుగా తాజాగా దీన్ని సైబర్‌ నేరగాళ్లు పీహెచ్‌పీ మార్చారని పేర్కొంది. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, అప్లికేషన్‌ కంపాటబిలిటీని చెక్‌ చేసే నెపంతో, రెండు.tmp ఫైల్స్‌ జనరేట్‌ చేస్తున్నట్టు  గుర్తించినట్టు తెలిపింది. అయితే ఈ రెండు డక్‌టైల్ వెర్షన్‌లు అత్యంత ప్రమాదకర మైనవని సూచించింది. ఇవి హానికరమైన కోడ్‌ను యూజర్ల ఖాతాలో వదిలి, దీని తరువాత, డేటా చోరీ చేస్తోందని వివరించింది.

పుర్రె ఆకారంలో ఉండే కంప్యూటర్ కోడ్ డక్‌టైల్ మాలావేర్‌ను 2021లో తొలిసారి గుర్తించారు. డక్‌టైల్ ఇన్ఫోస్టీలర్ కీలకమైన డేటాను యాక్సెస్‌ చేయడం ద్వారా ఆర్థిక  నష్టాన్ని కలిగించే అవకాశంకూడా ఉందని, ప్రొటెక్టివ్‌ లాగిన్ మెజర్స్‌ తీసుకున్న  ఖాతాలు కూడా ప్రమాదంలో పడవచ్చని హెచ్చరిచింది. పీహెచ్‌పీ ఇన్ఫోస్టీలర్‌తో వినియోగ దారుల సమాచారం ఇప్పటికీ ప్రమాదంలో ఉందని తెలిపింది. 
 

మరిన్ని వార్తలు