ఎలాన్‌ మస్క్‌కు ఎఫ్‌డీఏ భారీ షాక్‌!

5 Mar, 2023 14:11 IST|Sakshi

బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ ఫేస్‌ (బీసీఐ) స్టార్టప్‌ న్యూరాలింక్‌ కో-ఫౌండర్‌ ఎలాన్‌ మస్క్‌కు భారీ షాక్‌ తగిలింది. మనుషులపై చిప్‌ ఇంప్లాంట్‌ చేసే ట్రయల్స్‌ అనుమతుల్ని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) నిరాకరించింది. 
 
‘చిప్‌ బ్యాటరీ సిస్టమ్, దాని ట్రాన్స్‌ డెర్మల్ ఛార్జింగ్ సామర్థ్యాల గురించి ఎఫ్‌డీఏ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాటరీ విఫలమైతే రోగులకు ప్రమాదం. అయితే బ్యాటరీ విఫలం కావడానికి అవకాశం లేదు. వైఫల్యమైతే చుట్టుపక్కల కణజాలానికి నష్టం జరగకుండా నిరోధించడానికి తగిన చర్యలు ఉన్నాయనేలా హామీ ఇవ్వాలని’ ఎఫ్‌డీఏ న్యూరాలింక్‌ను కోరింది. 

ఎఫ్‌డీఏ లేవనెత్తిన మరొక ఆందోళన కరమైన విషయం ఏంటంటే? చిప్‌ను బ్రెయిన్‌ నుంచి తొలగించే సమయంలో మెదడులోని సున్నితమైన కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉంది. దెబ్బతింటే రోగి శరీరం రంగును మార్చేయడమే కాదు..మరణం సంభవించే అవకాశం ఉందని తెలిపింది. పై అంశాలను పరిగణలోకి తీసుకొని ఎఫ్‌డీఐ న్యూరాలింక్‌ హ్యూమన్ ట్రయల్స్‌ను వ్యతిరేకించిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

మరిన్ని వార్తలు