భారీగా తగ్గిన బంగారం ధరలు!

17 Feb, 2021 17:50 IST|Sakshi

న్యూఢిల్లీ: బంగారం కొనాలనుకునే వారికీ శుభవార్త. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ఫిబ్రవరి 11, ఫిబ్రవరి 12న తగ్గిన బంగారం ధరలు తర్వాత నాలుగు రోజులు స్థిరంగా ఉన్నాయి. మళ్లీ నాలుగు రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. నేడు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.45,900కు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగిరావడంతో దేశీ మార్కెట్‌లోనూ రేట్లు తగ్గాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 క్షీణించింది. దీంతో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రేటు రూ.47,730కు దిగొచ్చింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.500 పైగా క్షిణించి రూ.43,750కు పడిపోయింది. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్ కేజీ వెండి ధర రూ.1400 పడిపోయి రూ.73,600కు చేరుకుంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

చదవండి:

ఎస్‌బీఐ వినియోగదారులకు తీపికబురు

మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్

మరిన్ని వార్తలు