గాల్లో తేలినట్టుంది..నెక్ట్స్‌ ఏంటి? టీసీఎస్‌ గోపీనాథన్‌ కీలక వ్యాఖ్యలు 

17 Mar, 2023 13:01 IST|Sakshi

సాక్షి,ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు అనూహ్యంగా గుడ్‌బై చెప్పిన సీఈవో గోపీనాథన్‌ తన నిష్క్రమణపై కీలక  వ్యాఖ్యలు చేశారు.  తప్పుకోవడానికి ఇంతకంటే మంచి సమయం లేదని తాను భావించాననీ, సంతోషంగా,  మనసంతా  ఎంత తేలిగ్గా ఉందో చెప్పలేను..రీసెటింగ్‌కి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను అంటూ గోపీనాథన్‌ వ్యాఖ్యానించారు. పదవీకాలం ఇంకా నాలుగేళ్లు మిగిలి ఉండగానే (ఫిబ్రవరి 21, 2027 వరకు) తన పదవికి రాజీనామా చేయడం టెక్‌ వర్గాల్లో చర్చకు దారితీసింది. అదీ కంపెనీ చరిత్రలో ఒక సీఈవో సమయానికి ముందే తమ రాజీనామాను చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

టీసీఎస్‌లో 22 ఏళ్ల సుదీర్ఘ కరియర్‌కు గుడ్‌బై చెబుతూ గోపీనాథన్ గురువారం రాజీనామా ప్రకటించారు. సాధారణంగా సిగ్గుపడే గోపీనాథన్  శుక్రవారం ఉదయం  మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏక్షణమైతే  ఆసక్తిపోతుందో.. ఆక్షణమే తప్పుకోవాలి (జిస్ దిన్ మన్ ఉడ్‌ జాయే, ఉఎస్ దిన్ నికల్ జానే కా!) గత 48 గంటలుగా చాలా స్వేచ్ఛగా  ఉందని వ్యాఖ్యానించారు. అయితే తన భవిష్యత్తు ప్లాన్ల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా  టీసీఎస్‌ భవిష్యత్తు గురించి ఆలోచించి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే తన ప్లేస్‌లోమరొకరు ఉండటం  సముచితమని భావించానన్నారు. ఈ సందర్బంగా కృతివాసన్‌ సామర్థ్యంపై సంతృప్తిం వ్యక్తం చేశారు.  అలాగే తన రాజీనామాపై టాటా సన్స్ ఛైర్మన్, టీసీఎస్‌ మాజీ సీఎండీ చంద్రశేఖరన్‌తో చర్చించి, వారం క్రితమే ఈనిర్ణయం తీసుకున్నట్లు గోపీనాథన్ వివరించారు టీసీఎస్‌లో ప్రతీ నిమిషం ఆస్వాదించానని చెప్పుకొచ్చారు. కానీ కొన్నిసార్లు కీలక మైలురాళ్లను చేరుకున్నప్పుడు, ఆలోచన మొదలవుతుంది. నెక్ట్స్‌ ఏమిటి? అనేది కచ్చితంగా పెద్ద ట్రిగ్గర్ పాయింటే..  కానీ ప్రస్తుతానికి ఎలాంటి క్లూ లేదు అని చెప్పారు.  

కాగా గోపీనాథన్‌ రాజీనామా ఇచ్చినప్పటికీ ఈ ఏడాది సెప్టెంబర్‌ 15 వరకు గోపీనాథన్‌ టీసీఎస్‌తోనే కొనసాగనున్నారు. అలాగూ కొత్త సీఈవోగా (డిజిగ్నేట్‌) బీఎఫ్‌ఎస్‌ఐ డివిజన్‌ గ్లోబల్‌ హెడ్‌గా ఉన్న కే కృతివాసన్‌ను నియమించినట్టు కంపెనీ ప్రకటించింది.  2001లో టాటా ఇండస్ట్రీస్ నుంచి టీసీఎస్‌లో చేరారు గోపీనాథన్‌ 20013లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా,  2017లో  సీఎండీగా ఎంపికయ్యారు.
 

మరిన్ని వార్తలు