కలిసొచ్చిన పండుగ సీజన్‌.. వామ్మో మూడు నెలల్లో అన్ని అమ్ముడయ్యాయా!

2 Sep, 2022 05:04 IST|Sakshi

సెమీకండక్టర్ల సరఫరా

ముంబై: దేశీయ ఆటో అమ్మకాలు ఆగస్టులో పెరిగాయి. పండగ సీజన్‌ సందర్భంగా వాహనాలకు డిమాండ్‌ ఊపందుకోవడంతో పాటు సెమీ కండక్టర్ల సరఫరా మెరుగవడం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్‌మహీంద్రా, కియా మోటార్స్‌ విక్రయాల్లో వృద్ధి కన్పించింది. హ్యుందాయ్, టయోటా, స్కోడా కంపెనీలూ చెప్పుకోదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. అయితే హోండా కార్స్, ఎంజీ మోటార్స్‌ వాహన సంస్థల విక్రయాల్లో స్వల్ప క్షీణత కన్పించింది. ‘‘గడిచిన మూడు నెలల్లో మునుపెన్నడూ లేని విధంగా 9.92 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.

బలమైన డిమాండ్‌కు తగ్గట్టు సప్లై మెరుగుపడటంతో ఇది సాధ్యమైంది. ఈ పండుగ సీజన్‌లో 3.77 లక్షల వాహనాలను ఆర్డర్‌ చేసేందుకు కంపెనీ సన్నద్ధమైంది. పరిశ్రమ వ్యాప్తంగా పెండింగ్‌ ఆర్డర్లు 7–7.5 లక్షల వాహనాలు ఉండొచ్చు’’ అని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీవాస్తవ తెలిపారు.   మారుతీ సుజుకీ ఇండియా విక్రయాలు ఆగస్టులో 1,34,166కు చేరాయి. 30 శాతం పెరిగాయి.  హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా విక్రయాలు 59,068 నుంచి 5% వృద్ధితో 62,210 యూనిట్లకు చేరాయి.  

  

మరిన్ని వార్తలు