ఫెస్టివ్‌ బొనాంజా: హోం లోన్లపై ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్స్‌

13 Oct, 2022 08:29 IST|Sakshi

గృహ రుణాలపై పండుగ ఆఫర్లు 

ముంబై: ఇటీవల ఆర్‌బీఐ రెపో రేటును 1.9 శాతం మేర పెంచడంతో రుణాలపై వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. అయినప్పటికీ పండుగల దృష్ట్యా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ తక్కువ రేటుకే గృహ రుణాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఎస్‌బీఐ పావు శాతం మేర గృహ రుణాలపై రేటు తగ్గింపును అందిస్తున్నట్టు ప్రకటించింది. 2023 జనవరి 31 వరకు తీసుకునే గృహ రుణాలపై 8.40 శాతం రేటు అమలవుతుందని తెలిపింది. (Jio True 5G: అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సేవలు)

ప్రాసెసింగ్‌ ఫీజును ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. టాపప్‌ లోన్లపైనా 0.15 శాతం తక్కువ రేటును ఆఫర్‌ చేస్తున్నట్టు పేర్కొంది. తన గృహ రుణాల విలువ రూ.6 లక్షల కోట్ల మార్క్‌ను దాటినట్టు వెల్లడించింది. పరిశ్రమలో ఈ మార్క్‌ను సాధించిన తొలి సంస్థగా పేర్కొంది. గృహ రుణాల్లో అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ అయిన హెచ్‌డీఎఫ్‌సీ సైతం 0.20% తక్కువగా, 8.40శాతం కే గృహ రుణాలను అందిస్తున్నట్టు ప్రకటించింది. పండుగ ఆఫర్‌ నవంబర్‌ 30 వరకు అందుబాటులో ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కనీసం 750 క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న వారికి 8.40శాతం రేటు వర్తిస్తుందని తెలిపింది. జూన్‌ నాటికి గృహ రుణాల విలువ రూ.5.36 లక్షల కోట్లుగా ప్రకటించింది.  (5జీ కన్జ్యూమర్‌ సేవల్లోకి రావడం లేదు)

మరిన్ని వార్తలు