Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌ బైక్స్‌ రాకతో ఆ కంపెనీ దశ తిరిగింది..! 

17 Aug, 2021 17:28 IST|Sakshi

న్యూఢిల్లీ: భారీ అంచనాల మధ్య  ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌లను 75 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓలా సహా వ్యవస్థాపకుడు భవీష్‌ అగర్వాల్‌ లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్‌ బైక్లలో భాగంగా ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరుతో రెండు మోడల్స్‌ను మార్కెట్లలోకి తీసుకొనివచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఎస్‌1 మోడల్‌ ధర రూ.99,999గా ఉంటే ఎస్‌1 ప్రో మోడల్‌ ధర రూ.1,29,999గా కంపెనీ నిర్ణయించింది. (చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్)


భారత మార్కెట్లలో ఓలా ఎలక్ట్రిక్‌ బైక్లు వాహన ప్రియులకు ఏవిధంగా లాభం చేకూరుస్తుందో ఇప్పడే చెప్పలేము కానీ, ఓలా ఎలక్ట్రిక్‌ బైక్ల రాకతో విడిభాగాలను తయారుచేసే ఫియమ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ దశ మారిపోయింది. ఓలా ఎలక్ట్రిక్‌ బైక్ల విడిభాగాలకు ఫియమ్‌ ఏకైక సరఫరాదారుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్‌ బైక్లకు హెడ్‌ల్యాంప్స్‌, టెయిల్‌ ల్యాంప్స్‌, ఇండికేటర్లు, రేర్‌ ఫెండర్‌ అసెంబ్లీ, మిర్రర్స్‌ను ఫియమ్‌ ఇండస్ట్రీస్‌ అందించింది.

దూసుకుపోయిన కంపెనీ షేర్లు..!
తాజాగా స్టాక్‌ మార్కెట్‌లో ఫియమ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ షేర్లు 20 శాతం మేర పెరిగి రికార్డుస్థాయిలో అత్యధికంగా షేర్ల విలువ రూ. 951.80 వరకు చేరుకుంది. స్టాక్‌మార్కెట్‌లో ఇప్పటివరకు ఫియమ్ ఇండస్ట్రీస్ షేర్లు 68 శాతంమేర పెరిగాయి. ఓలా ఎలక్ట్రిక్‌ బైక్లకు విడిభాగాలను అందించిన కంపెనీగా ఫియమ్‌ నిలిచిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇతర ఎలక్ట్రిక్‌ వాహన తయారీదారులకు కూడా విడిభాగాలను ఫియమ్‌ సప్తే చేస్తోంది. భవిష్యత్తులో ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాల డిమాండ్లను తీర్చేందుకు ఫియమ్‌ సిద్ధంగా ఉందని వెల్లడించింది. (చదవండి: Apple: ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..!)

మరిన్ని వార్తలు