‘నేను మీ పని మనిషిని కాను సార్‌’.. ఇండిగో ఎయిర్‌ హోస్టెస్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో సపోర్ట్‌

21 Dec, 2022 19:25 IST|Sakshi

ప్రముఖ ఏవీయేషన్‌ సంస్థ ఇండిగో సిబ్బంది, విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల మధ్య జరిగిన వాగ్వాదం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిగ్గా మారింది. ఈ వివాదంలో మరో ఏవియేషన్‌ సంస్థ సీఈవో ఎయిర్‌ హోస్టెస్‌కు సపోర్ట్‌ చేశారు. నెటిజన్లు సైతం ఎయిర్‌ హోస్టెస్‌ తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  

ఇండిగో సంస్థ ఇస్తాంబుల్- ఢిల్లీ విమానాల కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. డిసెంబర్‌ 16న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడు తానుకోరుకున్న ఫుడ్‌ ఐటమ్స్‌ అందుబాటులో లేవని వాగ్వాదానికి దిగాడు. ఫ్లైట్‌లో ఉన్న ఎయిర్‌ హోస్టెస్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఈ ఆర్‌.గూర్‌ప్రీత్‌ సింగ్‌ మెన్స్‌ వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో అది తెగ చక్కెర్లు కొడుతోంది. 

వాళ్లూ మనుషులే


ఈ తరుణంలో ఫ్లైట్‌లో ప్రయాణికులు-ఎయిర్‌ హోస్టెస్‌ మధ్య జరిగిన ఘర్షణపై జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో సంజీవ్‌ కపూర్‌ స్పందించారు. ఇండిగో ఎయిర్‌ హోస్టెస్‌కు మద్దతు పలికారు. సిబ్బంది కూడా మనుషులేనని వ్యాఖ్యానించారు. ‘నేను ముందే చెప్పినట్లు,సిబ్బంది కూడా మనుషులే.నేను గత కొన్నేళ్లుగా విమానంలో సిబ్బందిని..చెంపదెబ్బలు కొట్టడం దూర్భాషలాడడం చూశాను. ప్రయాణికుడితో జరిగిన వాగ్వాదంలో ఆమె తీవ్రంగా త్తిడికి గురైంది. ఇప్పుడు ఆమె బాగుందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

ఎయిర్‌ హోస్టెస్‌కు అండగా నెటిజన్లు
సీఈవో వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందించారు.హెచ్‌ఆర్‌, యాజమాన్యం మహిళా సిబ్బందికి అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. వారు ఈ స్థాయిలో చేరేందుకు ఎంతో కష్టపడిందో అర్ధం చేసుకోవాలంటూ అండగా నిలుస్తున్నారు. ఈ ఘటనలో మహిళా సిబ్బంది తప్పు లేదని, ఎంతో ఓర్పుతో సమాధానం ఇచ్చిందని ప్రశంసిస్తున్నారు. 

ఫ్లైట్‌లో ఏం జరిగింది
ఇండిగోకు విమానం ‘6ఈ 12’ ఇస్తాంబుల్‌ నుంచి ఢిల్లీ వైపు వస్తుంది. ప్రయాణ సమయంలో ఎయిర్‌ హోస్టెస్‌కు, ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికుడు దురుసగా ప్రవర్తించడంతో ఓ ఎయిర్‌ హోస్ట్‌ కన్నీటి పర్యంతమైంది. దీంతో మరో ఎయిర్‌ హోస్టెస్‌ వారికి సర్ది చెప్పి గొడవను సద్దుమణిగించేందుకు వెళ్లింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రయాణికుడు మరింత రెచ్చిపోయాడు. గొడవను సద్దుమణించేందుకు ప్రయత్నించిన సదరు మహిళా ఉద్యోగిని వైపు చేత్తో సంజ్ఞలు చేశాడు. దీంతో సహనం కోల్పోయిన ఆమె  ప్రయాణికుడికి గట్టిగా సమాధానం ఇచ్చింది. 

"నువ్వు నా వైపు వేలు చూపుతూ ఎందుకు అరుస్తున్నావు. నీ వల్ల నా సిబ్బంది ఏడుస్తున్నారు. దయచేసి పరిస్థితని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సరిపడ భోజనాలు (విమానంలో) ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఆహారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం’ అని మాట్లాడుతుండగా ప్రయాణికుడు అడ్డు తగిలాడు 

"ఎందుకు అరుస్తున్నావు?" అని ప్రయాణికుడు గట్టిగా అరిచాడు. ఎయిర్ హోస్ట్‌ తన స్వరం పెంచుతూ...ఎందుకంటే మీరు మా మీద అరుస్తున్నారు. నీ మీ పని మనిషిని కాదు సార్‌. ఎయిర్‌ హెస్ట్‌ని. ఇండిగో సంస్థ ఉద్యోగిని అంటూ అక్కడి నుంచి వెళ్లి పోయింది. 

శాండ్‌ విచ్‌ లేదని..
ఫ్లైట్‌ వివాదంపై ఇండిగో యాజమాన్యం స్పందించింది. ప్రయాణీకుడు శాండ్‌విచ్ అడిగారని, విమానంలో ఫుడ్ ఐటమ్ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేస్తామని సిబ్బంది చెప్పారు. కానీ ఆ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌పై అరవడం ప్రారంభించాడు. దీంతో భయాందోళనకు గురైన ఎయిర్‌ హోస్ట్‌ ఏడ్చినట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు