ప్రైవేటీకరణకు ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు!

22 Apr, 2022 22:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేటీకరణకు వచ్చే ప్రభుత్వరంగ కంపెనీలను మరే ఇతర ప్రభుత్వరంగ సంస్థ కొనుగోలు చేయకుండా కేంద్ర ఆర్థిక శాఖ నిషేధాన్ని విధించింది. 

యాజమాన్య నియంత్రణ ఒక ప్రభుత్వరంగ సంస్థ నుంచి మరో ప్రభుత్వరంగ సంస్థలకు బదిలీ అయితే, సహజసిద్ధంగా ఉన్న అసమమర్థతలన్నవి కొనసాగొచ్చని.. ఇది నూతన ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్‌ఈ) విధానానికి విరుద్ధమని పేర్కొంది. 

గతంలో కొన్ని సీపీఎస్‌ఈల్లో తనకు ఉన్న మెజారిటీ వాటాలను అదే రంగంలో పనిచేసే మరో ప్రభుత్వరంగ సంస్థకు విక్రయించడం గమనార్హం. ఆర్‌ఈసీలో తన వాటాలను పీఎఫ్‌సీకి విక్రయించడం తెలిసిందే. అలాగే, హెచ్‌పీసీఎల్‌లో వాటాలను ఓఎన్‌జీసీకి కట్టబెట్టింది.    

>
మరిన్ని వార్తలు