ప్రైవేటు బ్యాంకర్లతో కేంద్ర పథకాలపై సమీక్ష

25 Jan, 2023 15:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక సేవలు అందుబాటులోకి తీసుకుని రావడానికి సంబంధించిన పథకాలు, సామాజిక భద్రతకు ఉద్దేశించిన కార్యక్రమాల్లో ప్రైవేటు బ్యాంకింగ్‌ సాధించిన పురోగతిని ఆర్థికశాఖ మంగళవారం సమీక్షించింది. ఈ మేరకు ప్రైవేటు బ్యాంకర్లతో సీనియర్‌ ఆర్థికశాఖ అధికారులు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థికశాఖ సేవల  కార్యదర్శి (డీఎఫ్‌ఎస్‌) డాక్టర్‌ వివేక్‌ జోషి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రైవేటు రంగ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రధాన్‌మంత్రి జన్‌ధన్‌ యోజన, ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన, పీఎం సేవానిధి వంటి పథకాల పురోగతి సమీక్షలో ప్రధాన అంశంగా ఉందని డీఎఫ్‌ఎస్‌ ఒక ట్వీట్‌లో పేర్కొంది. ఇదే అంశంపై గత వారం జోషి ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే.

చదవండి: అప్పట్లో రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి

మరిన్ని వార్తలు