ఆర్థిక పటిష్టత ప్రాతిపదికనే ఎల్‌ఓసీలు

24 Mar, 2023 04:23 IST|Sakshi

పీఎస్‌యూలకు ఆర్థికశాఖ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: తమ ఆర్థిక పటిష్టత, శక్తిసామర్థ్యాల ప్రాతిపదికనే ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌యూ) ‘లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌’ను జారీ చేయాలని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఎల్‌ఓసీల జారీ విషయంలో కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరుతూ చమురు,  విద్యుత్‌ రంగంలోని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కోరిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది.  సొంత ఆర్థిక బలం ఆధారంగా ఎల్‌ఓసీల జారీ సాధారణ వ్యాపార ఆచరణలో ఒక భాగం.

ఇది సంస్థలు వాటి క్యాపెక్స్‌  లేదా వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాల కోసం పోటీ రేట్ల వద్ద నిధులను సమీకరించుకోడానికి అలాగే జాయింట్‌ వెంచర్‌లు లేదా అనుంబంధ సంస్థలు  లేదా గ్రూప్‌ కంపెనీల వ్యాపార ప్రయోజనాలను పరిరక్షించుకోడానికి దోహదపడుతుంది. ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల కోసం నిధుల టై–అప్‌ కోసం బ్యాంకులకు ’లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌’ (ఎల్‌ఓసీ) జారీ చేయడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని నాన్‌ బ్యాకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) గత సంవత్సరం ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు