ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌, మరింత పెరగనున్న ఆహార ధరలు?

13 Sep, 2022 19:09 IST|Sakshi

ఆహారం,ఇంధన ధరల పెరుగుదలతో రిటైల్ వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారంగా ఈ ఏడాది ఆగస్టులో ద్రవ్యోల్బణం 7 శాతానికి పెరిగింది.దీంతో రానున్న రోజుల్లో ఆహారంతో పాటు ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

దేశీయ ఉత్పత్తుల్ని నిలకడగా ఉంచేందుకు, ధరల పెరుగుదలను అరికట్టడానికి గోధుమ పిండి, బియ్యం, మైదా మొదలైన ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ప్రభుత్వం నిషేధించింది. దీని ప్రభావం రాబోయే వారాల్లో ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

"రిటైల్ కన్జ్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (సీపీఐ)ఆధారంగా ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలై లో 6.71 శాతం నుండి ఆగస్టు నాటికి 7.0 శాతం నమోదు చేసింది. పెరిగిన ద్రవ్యోల్భణానికి కారణం ఆహారం, ఇంధర పెరుగుదలే కారణమని మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది.

మరిన్ని వార్తలు